బ్యాంక్ పేటలో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో 34వ డివిజన్ ప్రాంతంలోని బ్యాంక్ పేటలో కాకినాడ సిటీ కార్యదర్శి ముత్యాల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన భీమ్ యాత్ర మంగళవారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు స్థానిక దళితులను కలిసి వారికి దళితులకి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలని విశదీకరించారు. ఈ వై.సి.పి ప్రభుత్వం దళితుల ఓట్లు అర్ధించి అధికారంలోకి వచ్చిందనీ, తీరా వచ్చాక వారిపైనే దౌర్జన్యాలు చేస్తోందనీ, తిరిగి వారిపైనే ఎస్.సి & ఎస్.టి అట్రాసిటీస్ చట్టాన్ని ప్రయోగించి కేసులు బనాయిస్తోందని విమర్శించారు. దళితులంటే పూచికపుల్లతో సమానంగా ఈ ముఖ్యమంత్రి భావిస్తున్నాడనీ, అందుకే దళితులని చంపిన వారిని ప్రోత్సహిస్తూ పార్టీలో పదవులు ఇస్తున్నాడనీ, వై.ఎస్.ఆర్ కాంగ్రేస్ పార్టీ దళితవ్యతిరేక పార్టీ అని నిందిస్తూ వీళ్ళకి బుద్ధిచెప్పే రోజు దగ్గరపడిందనీ, జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పోరాటానికి మద్దతు ఇచ్చి వై.ఎస్.ఆర్ పార్టీని మట్టుబెట్టాలని దళితులకు పిలుపునిచ్చారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు కలశంలో సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ నగర ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, బండి సుజాత, ముత్యాల దుర్గ శివకుమారి, యేలేటి సోనీ ఫ్లోరెన్స్, సబ్బే దీప్తి, బోడపాటి మరియ, బట్టు లీల, రమణమ్మ, ఉమ తదితరులు పాల్గొన్నారు.