పెద్దాపురంలో జనసేనాని పుట్టినరోజు వేడుకలు

పెద్దాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని మన పెద్దాపురం నియోజకవర్గంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి గుడిలో 108 కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం, దాసాంజనేయ స్వామి గుడిలో పూజ కార్యక్రమం, అనాధ పిల్లలకి పౌష్టికాహారం కిట్లు పంపిణీ, తదుపరి రోటరీ క్లబ్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఇంకా రాత్రి వరకు అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గం ఇంచార్జ్ తుమ్మల బాబు, ఉమ్మడి తూర్పు గోదావరి జనసేన పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుంకర కృష్ణవేణి, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయ్యడం జరిగింది.