బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

  • జనసేనాని జన్మదినాన సేవా కార్యక్రమాలు చేపట్టిన బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నరసాపురం నియోజకవర్గంలో నరసాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం వేములదీవి వెస్ట్ పంచాయితీ కాపులకొడపలో శ్రీ శైవ వెంకటేశ్వర స్వామి వారి గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలలో భాగంగా అనంతరం నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. అనంతరం నియోజకవర్గంలోని వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం నరసాపురం నియోజకవర్గం రెల్లి గ్రామాలను సందర్శించి అక్కడి ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసి వారు అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని జనసేన పార్టీ తరపున వారికి భరోసా ఇచ్చి అనంతరం వారితో కేక్ కటింగ్ చేయించి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.