పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడమే లక్ష్యం: శ్రీమతి కాంతిశ్రీ

ఎచ్చెర్లలో జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక రణస్థలం మండలం బెజ్జిపురం జంక్షన్ లో కార్తీక అన్నసమారాధన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంతిశ్రీ మాట్లాడుతూ ఎచ్చెర్ల నియోజకవర్గంలో నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఒక్క చోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాగే మనం అంతా కలిసి పార్టీ కోసం బాగా కష్టపడి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని 2024కి సీఎం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని జనసైనికులకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం సుభద్రపురం నుండి చిలకపాలెం మీదుగా ఎచ్చెర్ల వరకు సుమారు 2000 మంది బైక్ ర్యాలీ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.