ఎన్నారై యూకె జనసేన ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

యూకె, సెప్టెంబర్ 2వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్నారై యూకె జనసేన ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు శుక్రవారం ట్రీటి సెంటర్లోని థియేటర్లో సాయంతం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వహించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ సినిమా పాటల వీడియోలు, సినిమా సన్నివేశాలు మరియు జనసైనికుల సందెసల వీడియోలను ప్రదర్శించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమ టికెట్ లను 5 పౌండ్లుగా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ద్వారా వచే మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా పంపించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా యూకేలోని జనసైనికులందరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమ వివరాలకోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
చందు సిద్దం: +44 7940303794
నాగ నామన: +44 7459759615.
కార్యక్రమం జరుగు స్థలం:
ట్రీటి సెంటర్, 44 హై స్ట్రీట్,
మొదటి అంతస్థు, థియేటర్, హౌన్స్లొ,
లండన్ టిడబ్ల్యు3 1 ఈఎస్.