ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

🔸జనసేన పార్టీ మరియు విజయనగరం జిల్లా చిరంజీవి యువత సంయుక్త ఆధ్వర్యంలో..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం ఉదయం జనసేన పార్టీ మరియు విజయనగరం జిల్లా చిరంజీవి యువత సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ కూడలిలో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో మెగా రక్తదాన శిబిరాన్ని జనసేన పారీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు.

ముందుగా ముఖ్య అతధిగా విచ్చేసిన పార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహనరావు కేక్ ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈసందర్భంగా అయన మాట్లాడుతూ వ్యవస్థ మార్పుకోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టారాని, అయన ఆశయాలకు తగ్గట్టుగా భారత దేశంలోనే రైతు భరోసా యాత్ర పేరిట రైతులకు ఆర్ధికంగా ఆదుకుంటున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని పార్టీ బలోపేతంనకు ప్రతీ యొక్క జనసైనికులు, వీరామహిళలు పాటుపడాలని అన్నారు.

నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఆగష్టు 27నుండి సెప్టెంబర్ 2 వరకు నిర్వహించామని, ప్రతీకార్యక్రమం ప్రజలతో మమేకమై, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధముగా నిర్వహించడం జరిగిందని, భవిష్యత్ లో పార్టీ బలోపేతంనకు మరెన్నో కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

పలువురు రక్తదానం చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘసేవకులు, బ్లడ్ బ్యాంక్ పి.ఆర్.ఓ. ముడిదాపు రాము,జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్. మురళీమోహన్, పిడుగు సతీష్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, గురుబిల్లి రాజేష్, శీర కుమార్, పత్రి సాయి, యాతపేట రవి, సూరిబాబు, పైడిరాజు, నాని, పొట్నూరు దాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *