రాజానగరంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజానగరంలో జనసేనాని జన్మదిన వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకలలో భాగంగా భారి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బత్తుల బలరామకృష్ణ దంపతులు పలు కేక్ కటింగ్ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.