కాట్రావులపల్లి గ్రామంలో జనసేన వనరక్షణ

  • జనం కోసం జనసేన 585వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 585వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి మొక్కల పంపిణీ కార్యక్రమం ఆదివారం జగ్గంపేట మండలం, కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 300 మొక్కలు జనసైనికుల ఆధ్వర్యంలో పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 13100 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఆదివారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు కానేటి లక్ష్మణ్, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, గ్రామ ఉపాధ్యక్షులు సుంకర శ్రీను, గ్రామ ఉపాధ్యక్షులు చిట్టీడి రామారావు, గ్రామ సంయుక్త కార్యదర్శి బూసి కుమార్, సాంబారు వర ప్రసాద్, శివుడు అమ్మిరాజు, కేలిం రాజుబాబు, చెక్కపల్లి సతీష్, శివుడు గణేష్, కొండేపూడి సత్యకృష్ణ, చిట్టీడి స్వామి, చిట్టీడి దుర్గాప్రసాద్, నల్లా శివ, కొత్త చక్రి, గోనేడ నుండి వల్లపుశెట్టి నానిలకు జనసేన తరఫున కృతజ్ఞతలు తెలిపారు.