భాకరాపేట ఘాట్ ఘటనలో క్షతగాత్రులను పరామర్శించిన జనసేన

  • క్షతగాత్రులను పరామర్శించి, ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జనసేన నాయకులు.
  • బాకరాపేట ఘాట్ లో ప్రజల ప్రాణాలు కోల్పోతే గాని స్పందించరా?
  • మృతులకు 25 లక్షలు… క్షతగాత్రులకు 5 లక్షలు, పరిహారం ఇవ్వాలి.

తిరుపతి, పాలక ప్రభుత్వం బాకరాపేట ఘాట్ నిర్మాణ ఏర్పాటు, భద్రతలో విఫలమైన కారణంగా శనివారం ధర్మవరం నుండి తిరుచానూరుకు నిశ్చితార్థం కోసం బస్సులో వస్తూ, లోయలో పడి అత్యంత భయానక సంఘటన చోటు చేసుకుందని, ఇందులో చనిపోయినవారికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 5 లక్షల పరిహారం చెల్లించాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసుధన్ రెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ లు డిమాండ్ చేశారు.

స్థానిక ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియాతో వీరు మాట్లాడుతూ.. టిడిపి పాలనలో బాకరాపేట ఘాట్ లో జరుగుతున్న యాక్సిడెంట్ లను దృష్టిలో ఉంచుకొని నేషనల్ హైవే గా గుర్తించి నరసింగాపురం వరకు రోడ్డును ఏర్పాటు చేశారని, అనంతరం వచ్చిన వైసీపీ పాలనలో ఈ ఘాట్ రోడ్డు ఏర్పాటు మరుగున పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. దీని వలనే నేడు ఈ అత్యంత ఘోర సంఘటన, ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు, తిరుమల ఘాట్ రోడ్డు తరహాలో భారీగా పేరా పెట్ వాల్ టిటిడి నిర్మించినట్లు వెంటనే భాకరాపేట ఘాట్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు తరలించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ సిటీ ప్రెసిడెంట్ రాజా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, సుమన్ బాబు, రాష్ట్ర చేనేత కమిటీ సభ్యులు సురేంద్ర అడపా, మనోహర్ దేవర, కీర్తి, తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజ రెడ్డి, జిల్లా యువ నాయకులు పార్ధు, మనోజ్, సురేంద్ర మనోహర్, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆకేపాటి సుభాషిని, కీర్తన మరియు జనసేన నాయకులు కార్యకర్తలు.