మంచినీటి బోరు బాగు చేయించిన జనసేన కార్పొరేటర్

గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు గంగవరం గ్రామం పేర్ల నూకాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాలారిపాలెం గ్రామం చాలా నెలల నుండి మంచినీళ్లు బోరు మూత పడిందని. స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని 64 వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద రెడ్డికి ఫిర్యాదు చేయగా ఆయన వెంటనే స్పందిస్తూ కేవలం 24 గంటల్లోనే మంచినీళ్లు బోరు బాగు చేయించారు. ఈ కార్యక్రమానన్ని విశాఖపట్నం జిల్లా జనసేన పార్టీ మాజీ పార్లమెంటు అధికార ప్రతినిధి సిహెచ్ ముసలయ్య ఆర్గనైజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె బాబురావు, శ్రీను, అమ్మోరు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.