సిబ్బందిని రెగ్యులర్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని జనసేన డిమాండ్

బాసర ఐఐఐటిలో గత రెండు రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 6000 వేల మంది విద్యార్థులు, ధర్నా చేస్తున్నారు. వారికి మద్దతుగా భైంసా నుండి బాసర వెళ్తున్న జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు జనసైనికులను పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. పోలీస్ అరెస్ట్ లకు భయపడం విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మంచి నీటి సౌకర్యం, నేర్చుకోవడానికి లాప్ టాప్ లు, రూమ్స్ అస్సలు బాగాలేవు అసలే వర్షాకాలం రూమ్ నిండా వాటర్ ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు. యూనివర్సిటీలో మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థ కావడం వల్ల కేవలం డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. కనీసం ఒక్కసారైనా ఇప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి, కానీ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్ర రెడ్డి పర్యటన చేయకపోవడం చాలా విడ్డూరం పేరుకే యునివర్సిటీ కాని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. వెంటనే విద్యా సంస్థ బాసర ఐఐఐటిలోని ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, హెచ్.ఆర్.టి, మెంటర్స్, వివిధ బోధనేతర సిబ్బందిని రెగ్యులర్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల భాధ్యత రాహిత్యం వల్లనే అక్కడ సరైన వసతి విద్యా సౌకర్యం కల్పించ లేక పోయారు. యూనివర్శిటిని కాంట్రాక్ట్ పద్ధతి నుండి విముక్తి చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తాం. అరెస్ట్ అయిన జనసైనికులు అర్జున్, మయూర్ తదితరులు.