కాకినాడ సిటిలో జగనన్న కాలనీలలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

కాకినాడ సిటి: జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న కాలనీల నిర్మాణంపై వాస్తవాలను వెలికితెచ్చే కార్యక్రమం కాకినాడ సిటి జనసేన పార్టీ అధ్యక్షులు తోట సుధీర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు & కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ కాకినాడ సిటి ప్రజలకు మంజూరు చేసిన ఇళ్ళ స్థలాల ప్రాంతాన్ని స్వయంగా మొత్తం పర్యటించి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లడుతూ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ కొమరగిరి ప్రాంతంలో శంకుస్థాపన చేసి ఆర్భాటంగా మొదలెట్టారనీ, కనీసం ఎటువంటి మౌలికవసతులు సదుపాయాలనూ కల్పించకుండా లబ్దిదారులను తొందరపెట్టి ఇళ్ళ నిర్మాణం చేయాలంటూ వత్తిడి చేయడం దారుణమన్నారు. లబ్దిదారుల మొత్తానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఋణం వెరశి మొత్తం లక్షా ఎనభై వేల రూపాయల వ్యయంతో నిర్మాణం అవ్వట్లెదని లబ్దిదారులు మొత్తుకుంటున్నారనీ, కనీసం తాగునీరు వసతి కూడా దిక్కులేకుండా ఉందని, వానలకి ఈ ప్రాంతం మొత్తం చెరువులా తయారయ్యిందని వాపోతున్నారన్నారు. మంజూరు చేసిన 16 వేల గృహాలకు గాను ఇప్పటికి కేవలం పదిలోపు ఇళ్ళు పూర్తి అయినట్టు కనపడుతున్నాయనీ, వీటికి విద్యుత్తు సదుపాయంకోసం లైన్లను సొంత ఖర్చుతో వేయించుకోవాలిసివచ్చిందనీ, ఇలా పూర్తి అవ్వడానికి సుమారు ఐదు లక్షలు అదనంగా వెచ్చించాల్సి వచ్చిందని లబ్దిదారులు తెలిపారన్నారు. ఇదీ పేదలపై వై.సి.పి ప్రభుత్వానికున్న ప్రేమ అనీ, ప్రచారంపై ప్రేమ తప్ప మనస్సాక్షి లేదనీ దీనికి సాక్షమే భారతదేశంలో పేదల ఇళ్ళ నిర్మాణంలో మన రాష్ట్రం 19వ స్థానం అని, దక్షిణ భారతదేశంలో 5వ స్థానమన్నారు. వై.సి.పి ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమంపై శ్రద్ధ లేదనడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలని ప్రశ్నించారు. లబ్దిదారులకు న్యాయం జరిగేలా వారికి అండగా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, ఐ.టి కోఅర్డినేటర్ వరప్రసాద్, సిటి కమిటీ నాయకులు పెద్దిరెడ్డి ఉదయభాస్కర్, మడ్డు విజయ్ కుమార్, లోవరాజు, కాంటా రవిశంకర్, కుండ్రు దుర్గాప్రసాద్, ఇంటి రాజేష్, మిర్యాల హైమవతి, వార్డు అధ్యక్షులు శ్రీమన్నారాయణ, మనోహర్ లాల్ గుప్తా, మండపాక దుర్గాప్రసాద్, జనసేన నాయకులు విజయ్ గోపాల్, మోసా ఏసేబు, సతీష్ కుమార్, భగవాన్, వీరబాబు, తోట నరసిమ్హకుమార్, అగ్రహారం సతీష్, ఆనంద్ కిషోర్, మావులూరు సురేష్, రాణా, రఘు తదితరులు పాల్గొన్నారు.