మంత్రి అమర్నాథ్ పై కేసు నమోదు చేసిన జనసేన నాయకులు

మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్.. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పై అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలు చేసినందుకుగాను, మంత్రి గారి పదజాలం వలన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తీవ్ర మనోవేదనకు గురి అయ్యామని కావున బేషరతుగా మంత్రి పై కేసు నమోదు చేయమని పెందుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసు అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వీరమహిల పార్వతి మాట్లాడుతూ.. మంత్రి స్థానంలో ఉండి రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి పై వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ.. మహిళలు, లోకల్ నాన్, లోకల్, ఇంటర్నేషనల్ విభజించి చాలా చులకనగా మాట్లాడటం జరిగిందని, పవన్ కళ్యాణ్ గారి తో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ మహిళలు మాట్లాడతారని ఇతనికి ఏమిటి బాధ అని తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారని.. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని మాట్లాడడం జరిగింది. స్థానిక నాయకులు జనార్ధన శ్రీకాంత్ మాట్లాడుతూ.. అసందర్భంగా, అనాలోచితంగా, అసభ్య పదజాలంతో మంత్రిగారు మాట్లాడటంతో మానసిక క్షోభకు గురయ్యానని, కౌలు రైతులు మరణిస్తే వారి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో అక్కున చేర్చుకుని వారికి లక్ష రూపాయలు అందిస్తుంటే అలాంటి మనిషిని ఏనోటి తో అన గలుగుతారని, వీరి కుటుంబంలో కూడా మహిళలు ఉండగా మహిళలను చాలా చులకనగా మాట్లాడడం మంత్రి కి తగునా అని ప్రశ్నించడం జరిగింది. స్థానిక నాయకులు ఉరిటి గోవింద్ మాట్లాడుతూ.. అనకాపల్లిలో కౌలు రైతులు చాలా మంది మరణించారని, వారిని పరామర్శించే స్థాయిలో కూడా మీరు లేరు అని అలాంటిది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే మీరు విమర్శించడం ఎంత వరకూ సమంజసమని, మీ యొక్క ప్రవర్తన ఇదే విధంగా కొనసాగితే రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మీకు తగిన బుద్ధి చెబుతుంది అని, సుమోటోగా కేసుని తీసుకొని కేసు ఫైల్ చేయమని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జుత్తడా శ్రీను, నాయుడు, శ్రీను, షకీబ్, అశోక్, శేఖర్, లీల, మీనాక్షి, జయ, శివాజీ మరియు జనసైనికులు పాల్గొన్నారు.