రోడ్ల దుస్థితిపై మామిడికుదురు జనసేన డిజిటల్ క్యాంపెయిన్

మామిడికుదురు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా శోమవారం మామిడికుదురు మండలం మాకనపాలెం, కొమరాడ వెళ్ళే ప్రదాన రోడ్డు దుస్థితిపై గ్రామశాఖ ఇంటి మహేంద్ర ఆధ్వర్యంలో #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజ, మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు, మట్టా సత్తిబాబు, ఇల్లి రాంబాబు, పోతు కాశీ, మదింశేట్టి బుజ్జి, కట్టకంశెట్టి ప్రసాద్, కాట్రేనిపాడు నాగేంద్ర, కోల సురేష్, మద్దాల మోహన్, ముస్కుడి మురళి, మరియు మామిడికుదురు మండల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.