జనసేన డిజిటల్ క్యంపెయిన్ మూడు రోజుల్లో 697.4 మిలియన్ల రీచ్: జనసేనపార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి

ఆనాడు 32 మంది ప్రాణాలు త్యాగాల ఫలితమే విశాఖకు ఉక్కు కర్మాగారం వచ్చిందని ఇప్పుడు కేంద్రం విశాఖ ఉక్కు ను ప్రైవేటు పరం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వము చోద్యం చూస్తుందని జనసేన తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల తమ నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో డిజిటల్ క్యాంపింగ్ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల్లో 697.4 మిలియన్ల మందికి రీచ్ అయిందని పార్లమెంట్లో వైకాపా ఎంపీలు టిడిపి ఎంపీలు విశాఖ ఉక్కు కోసం తమ గళం విప్పాలని ఆమె తెలిపారు. ప్రత్యేక హోదా రైల్వేజోన్ కనుచూపు మేరలో కూడా కనబడటం లేదని దీనికి కారణం ఈ ప్రభుత్వాల వైఫల్యమేనని ఆమె అన్నారు.

జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చి రోడ్లు బాగు చేసే ప్రక్రియను మా కార్యకర్తలు స్వయంగా బాగు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఏది ఏమైనా వచ్చేది జనసేన పార్టీ ప్రభుత్వం అని కృష్ణవేణి తెలిపారు.