విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని జనసేన డిజిటల్ క్యాంపెయిన్: బాడిశ మురళీకృష్ణ

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సూచనలు మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షనే లక్ష్యంగా జనసేన పార్టీ తరపున విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మూడు రోజులపాటు నిర్వహించే ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా జనసేన పార్టీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం జగ్గయ్యపేట పట్టణంలో పొట్టిశ్రీరాములు విగ్రహనికి నివాళులు అర్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ మాట్లాడుతూ ఎంతో మంది బలిదానాలు, ప్రాణ త్యాగాలతో వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలసిన బాధ్యత మనందరకి ఉందని అయితే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గళం విప్పకుండా 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది లోక్ సభ సభ్యులు ఉండి కూడా ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా గళం విప్పకపోగా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో ఉన్న వారికి బాధ్యతను గుర్తు చేయాలన్న లక్ష్యంతో జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని వైసీపీతోపాటు టీడీపీ ఎంపీలు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడుతూ ప్లకార్డులు ప్రదర్శించాలని వారి బాధ్యతను వారికి తెలియచేసేలా ఎంపీలకు ట్యాగ్ చేసే విదంగా ఈ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నామన్నారు. రాజకీయ క్షేత్రంలో పార్టీల మధ్య విబేధాలు ఉన్నా ప్రతి పార్టీ అంతిమ లక్ష్యం ప్రజా సేవే. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షన ప్రతి ఆంధ్రుడి కర్తవ్యం అని కావున కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణను నిలుపుదల చేసే విధంగా పునరాలోచన చేయాలన్న విషయాన్ని కేంద్రానికి తెలియజేసే బాధ్యత వైసిపి ప్రభుత్వం పై ఉందని మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్, పెనుగంచిప్రోలు మండల నాయకులు తునికిపాటి శివ నాగులమీరా, నవీన్,గోపినాధ్, నాగబాబు, నారాయణ,, హరీష్, గోపి, శ్రీహరి, రాంప్రసాద్, అజయ్, బాజీ, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.