అంధకారంలోని హరిజనవాడలో వెలుగును నింపిన జనసేన

*వీధి దీపాలు వేయిస్తున్న రాటాల రామయ్య

సిద్దవటం మండలం ఉప్పరపల్లి గ్రామపంచాయతీలోని హరిజనవాడలో గత కొంత కాలం నుండి వీధి దీపాలు వెలగక పోవడంతో పలుమార్లు పంచాయతీ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించకపోవడంతో అంధకారంలో ఉన్న హరిజనవాడ కాలనీవాసులు రాత్రుల్లో తిరగాలంటే పాముల భయం. ఈ విషయాన్ని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించి తన సొంత నిధులతో మంగళవారం హరిజన వాడలోని విద్యుత్ స్తంభాలకు వీధిలైట్లు ఏర్పాటు చేయించారు. వీధిలైట్లు వేయించ మని అడగగానే లైట్లు వేయించి నందుకు హరిజనవాడ కాలనీవాసులు జనసేన చేనేత వికాస కార్యదర్శి రామయ్యను అభినందించారు. ఈ సందర్భంగా జనసేన చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా మా జనసేన పార్టీ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.