యువతకు స్ఫూర్తి ప్రదాత పద్మవిభూషణ్ చిరంజీవి: బొర్రా

సత్తెనపల్లి: నేటి యువతకు స్ఫూర్తి ప్రదాత పద్మవిభూషణ్ చిరంజీవి అని సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్ర వెంకట అప్పారావు అన్నారు. చిరంజీవికి వచ్చిన అవార్డుని పురస్కరించుకొని పార్టీ కార్యాలయం వద్ద టపాసులు పేల్చి కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి గారికి పద్మ విభూషణ్ ప్రకటించడం పట్ల భారత ప్రభుత్వానికి బిజెపి పార్టీకి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో భారతరత్న తీసుకోవాలని కోరుకుంటున్నాం. రక్తదానం, నేత్రదానం, పకృతి వైపరీత్యాలు జరిగిన అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి చిరంజీవి. కరోనాకాలంలో ఆక్సిజన్ సెంటర్లు ప్రజలకు అందేలా చేశారు. స్ఫూర్తి ప్రదాత, సామాన్యుడి నుండి అసమాన్యుడిగా ఎదిగిన వ్యక్తి చిరంజీవి. చిరంజీవి అభిమానిగా చెప్పుకోవడానికి గర్వపడతాను. ఆయన స్ఫూర్తితోనే నేను ఈ స్థాయికి వచ్చానన్న బొర్రా. చిరంజీవి ఆదర్శప్రాయుడు. స్వయంకృషీతో ఉన్నత శిఖరాలు అధిరోహించాడు.
యువతకు స్ఫూర్తి ప్రదాత చిరంజీవి. ఆయన ఆదర్శంతోనే అనేక సేవా కార్యక్రమాలు చేశాను. 16 సార్లు రక్తదానం చేశాను, నేత్రదానం కూడా ఒప్పుకున్నాను. మెగా ఫ్యామిలీ కుటుంబానికి అండదండగా ఉంటాము. ఆ కుటుంబంతోనే ఉంటాము. మెగా ఫ్యామిలీతో ఉన్నందుకే సత్తెనపల్లి జనసేన సీటు కావాలని అడుగుతున్నాను. ఉన్నా పోయిన మెగా ఫ్యామిలీతోనే మెగా ఫ్యామిలీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. మెగా ఫ్యామిలీకి తప్ప ఎవరికి తల వంచం. పొత్తు ప్రకంటించే వరకు మన పని మనదే అన్న పవన్. ఎమ్మెల్యే 1/3 కావాలి అన్న పవన్ కళ్యాణ్. పవన్ కు ముఖ్యమంత్రి హోదా ఇప్పించాలి. వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్ రావడం అతను తెలుగు వ్యక్తి, మాజీ ఉపరాష్ట్రపతిగా చేసిన ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నము. అలాగే పురస్కార గ్రహితలందరికి శుభాకాంక్షలు తెలియజేసిన సత్తెనపల్లి జనసేనాని బొర్రా.