పాల్వంచ మండలంలో ఇంటింటికి గడపగడపకి జనం కోసం జనసేన

కొత్తగూడెం: ఇంటింటికి గడపగడపకి జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా బుధవారం పాల్వంచ మండలంలోని బండ్రుగొండ, దంతేలబోరు ఎస్ సి కాలనీ గ్రామాల్లో జనసేన కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి వేముల కార్తిక్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి రాబోయే రోజుల్లో అండగా ఉంటాం అని తెలియచేశారు. అలాగే వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కొత్తగూడెంలో జనసేన పోటీ చేస్తునందున్న జనసేన కి ఓట్ వేసి గెలిపించమని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్వంచ మండలం ప్రెసిడెంట్ ఓలపల్లి రాంబాబు, దుర్గ తదితరులు పాల్గొన్నారు.