దిబ్బగూడెం, రామయ్యపేట గ్రామాల్లో జనంకోసం జనసేన

పోలవరం, జనంకోసం జనసేన కార్యక్రమాన్ని జీలుగుమిల్లి మండలం టీ గంగన్నగూడెం పంచాయతీ దిబ్బగూడెం, రామయ్యపేట గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్యలపై తక్షణమే పంచాయతీ అధికారులతో కరెంట్ అధికారులతో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి ఆ సమస్యలపై దృష్టి సారిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన పార్టీ మేనిఫెస్టో సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తెలియ పరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జూనియర్ పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం జనసేన ఇంచార్జ్ చిర్రి బాలరాజు మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, వీరంకి వెంకటేశ్వరరావు, సరే ముత్యాలరావు, కొరస వెంకటేశ్వరరావు, కొప్పుల శ్రీకాంత్, కుంజా రమేష్, కుంజా సోమరాజు, కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.