దుగాన పుట్టుగ గ్రామంలో జనసేన ఉచిత మెగా వైద్య శిబిరం

ఇచ్చాపురం, ఉద్దానంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి ఆధ్వ్యంలో జేమ్స్ హాస్పటల్ సౌజన్యంతో దుగాన పుట్టుగ జనసేన టీమ్ అధ్యక్షతన దుగాన పుట్టుగ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు మరియు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బైపెల్లి ఈశ్వర్, రాష్ట్ర మత్స్య కార విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా పాల్గొన్నారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు గా 250 పేషంట్ లకి ఉచితంగా బీపీ, షుగర్ మరియు గుండె వ్యాధి ఈసీజీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు. పాల్గొన్న జనసేన తరపున ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు తెలియజేడం జరిగింది.