కోర్టు ఉద్యోగాలకు జనసేన ఉచిత శిక్షణ

అమలాపురం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించి 3,673 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనసేన పార్టీ నాయకులు డి.ఎమ్.ఆర్ శేఖర్ నేతృత్వంలో ఉచితంగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. డిసెంబర్ 6వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు, అమలాపురం చెన్నమల్లేశ్వరస్వామి గుడి వద్ద గల, జనసేన ప్రాంగణంలో ఈ శిబిరం ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం 9116611333 కి కాల్ చేసి తెలుసుకోవచ్చునని అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ టీమ్ తరఫున తెలియజేడం జరిగింది.