కోటిపల్లి గ్రామంలో ఇంటింటికి జనసేన

  • రామచంద్రపురం నియోజకవర్గంలో ఇంటింటికి జనసేన 7వ రోజు
  • గాజు గ్లాసు గుర్తుకు ఓటేద్దాం.. పవన్ అన్నను గెలిపిద్దాం..

రామచంద్రపురం: జనసేన రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు గంగవరం మండల అధ్యక్షులు చిర్రా రాజకుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన 7వ రోజు పర్యటనలో భాగంగా గంగవరం మండలంలో శనివారం కోటిపల్లి గ్రామంలో పోలిశెట్టి చంద్రశేఖర్ గారు వెళ్లి ‘ఇంటింటికి జనసేన’ కార్యక్రమం ప్రారంభించి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు గల కరపత్రాలను ప్రజలకు అందజేయడం జరిగింది. కోటిపల్లి గ్రామంలో ఇంటింటికి పర్యటిస్తూ మరియు రోజువారి వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తీసుకొచ్చే విధంగా సహకరించవలసిందిగా పోలిశెట్టి చంద్రశేఖర్ తెలియజేయడం జరిగింది. కోటిపల్లి గ్రామంలో మహిళలు పోలిశెట్టి చంద్రశేఖర్ ను సాలువాతో సన్మానించడం జరిగింది. రాబోయే కాలంలో కచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు జనసేన నాయకులు, జనసైనికులు ఈ పర్యటనలో మాకుతెలియజేయడం జరిగిందిని పోలిశెట్టి చంద్రశేఖర్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ, గంగవరం మండల జనసేననాయకులు, జనసైనికులు, జిల్లాకార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీఅధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, అందరూ భారీ స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.