సామాన్యుడి గళం వినిపించేలా పల్లె పల్లెకు జనసేన

విజయనగరం జిల్లాలో మొట్టమొదట సారి గజపతినగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లె పల్లెకు జనసేన పాదయాత్రలో భాగంగా.. రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపరిచేందుకు జనసేన షణ్ముఖ వ్యూహం ప్రజలకు వివరిస్తూ కర్రపత్రాలు పంచుతూ.. ప్రజల నుండి స్వీకరించిన సమస్యలను వెంటనే కలెక్టర్ కి మరియు సంబంధించిన అధికారులకు ఇచ్చి పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జులై 3 నుండి విజయవాడలో జనవాణి-జనసేన పేరుతో ప్రజలనుండి సమస్యలు అర్జీ ద్వారా స్వీకరించి సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించే కార్యక్రమం చేస్తున్నారు, అలాగే ఉత్తరాంధ్రలో జనవాణి కార్యక్రమం ఈ నెలలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

అధ్యక్షుల వారి అడుగు జాడలలో మనము కూడా మన గజపతినగరం నియోజకవర్గంలో 5 మండలంలో ఉన్న అన్ని గ్రామాలు వెళ్లి ప్రజలు సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించి దిశగా అడుగులు వేస్తున్నాం, అలాగే ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు చేసినటువంటి ప్రజా సేవా కార్యక్రమాలు వివరిస్తూ, ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు, ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున, ఆయన నేరుగా కుటుంబం దగ్గరికి వెళ్లి ధైర్యాన్ని నింపి వస్తున్నారు, మన రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులకు ఆయన భరోసా ఇవ్వడం జరిగింది, ఆయన చూపించే మార్గంలో మనం నడుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మన అదృష్టం గా భావిస్తున్నాము, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటూ,పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో మహిళలు,వృద్ధులు, యువకులు, పెద్ద సంఖ్యలో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారు.. ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.. ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారం వస్తుందని ప్రజలే మాకు చెబుతున్నారు.. రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని ప్రజలే చెబుతున్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు అద్దడా మోహన్ రావు,మిడతాన రవి కుమార్, టీ.రామకృష్ణ(బాలు), రమేష్ రాజు ,లోపింటి కళ్యాణ్. గజపతినగరం నాయకులు కలిగి పండు,శ్రీను,హరీష్ నాని ,ఆదినారాయణ, దల్లి నాయడు, చాలం, సురేష్, శ్రీను, రవి, నాయడు, రవీంద్ర, జోయే, భాస్కర్, సురేష్ పాల్గొన్నారు.