జనసేన చేనేత సదస్సు

శ్రీకాకుళం, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరియు జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు చేనేత కళాకారుల రాజకీయ చైతన్యం కొరకు మరియు చేనేత వర్గాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకువెళ్లడానికి ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో మొదటగా ఖాదీ భవనాన్ని సందర్శించి అక్కడ నుండి చేనేతల గృహాలకు స్వయంగా వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని తదనంతరం ఏర్పాటుచేసిన చేనేత సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేతల సమస్యల గురించి చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ…

  • ఖాదీ భవన్ లోని అక్కడ అధికారులతో మాట్లాడి ఖద్దరు నేసే చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ ఎంత శాతం ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
  • పొందూరు ఖద్దరు, అంచు పంచెలు మరియు రకరకాల వస్త్రాలకు ప్రసిద్ధి అయిన పొందూరు మండలంలో చేనేతల కష్టార్జితం దళారుల చేతుల్లోకి వెళ్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
  • ప్రభుత్వం అంత్యోదయ కార్డులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
  • ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం నిజంగా ప్రభుత్వాల వైఫల్యాలకు నిదర్శనమని తెలియజేశారు

*ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు చేనేతను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు చేనేత రంగం ప్రస్తుతం ప్రభుత్వ విధానాల వలన కుదేలై పోతుందని మరియు పెరుగుతున్న నూలు మరియు పట్టు రేట్ల వలన చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్య పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పార్టీ చేనేత కమిటీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేనేతల సమస్యల మీద నివేదికలు అందిస్తామని మరియు వాటి పరిష్కారానికి కచ్చితంగా పోరాడుతామని తెలియజేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికుడిని వ్యాపారవేత్తగా తయారుచేయడమే జనసేన ధ్యేయమని తెలియజేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు పవన్ కళ్యాణ్ కి చేనేత కళ పట్ల ఉన్న ప్రేమను తెలియచేసి చేనేతకు పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటాన్ని మరొకసారి గుర్తు చేసి జనసేన పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్, పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం వైస్ చైర్మన్ ప్రియాంక బరాటం, ఉత్తరాంధ్ర వీర మహిళా విభాగం రీజనల్ కోఆర్డినేటర్ లు నాగలక్ష్మి మరియు కిరణ్ ప్రసాద్, ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్, రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శులు జంజనం సాంబశివరావు మరియు చింత గోవర్ధన్, పార్టీ మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కోఆర్డినేటర్ వెంకటమారుతి రావు, ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు సయ్యద్ కాంతిశ్రీ, అర్జున్ భూపతి, రాజాం నియోజకవర్గం నాయకులు ఎన్ని రాజు, ఎచ్చెర్ల, ఆముదాలవలస, రాజాం జనసేన పార్టీ నాయకులు మరియు చేనేత కళాకారులు పాల్గొన్నారు.