రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగల సత్తా జనసేనకే ఉంది: పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌, అవినీతితో కుళ్లిపోయిన వైసీపీ సర్కార్ ను గద్దె దించి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, మరో కొన్ని రోజులు కలిసికట్టుగా పనిచేస్తే వైసీపీ దుష్టపాలన నుంచి విముక్తి పొందవచ్చని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ చెప్పారు. ప్ర‌ముఖ హైకోర్టు న్యాయ‌వాది బైరా వెంక‌టకృష్ణ‌ను గురువారం జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌తో క‌ల‌సి పెంటేల బాలాజీ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. శాలువ‌తో స‌త్క‌రించి, జ‌న‌సేన పార్టీలో చేరాల‌ని సాద‌రంగా ఆహ్వానించారు. ఇందుకు బైరా కృష్ణ సానుకూలంగా స్పందించారు. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో మాట్లాడుతూ రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీని, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగల సత్తా జనసేన పార్టీకే ఉందన్నారు. 25 ఏళ్ల రాజకీయాలను ఊహించుకుంటే కనిపించే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ ని తెలిపారు. రాష్ట్రం బాగుపడాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయతీపరుడైన నాయకుడికి మనం అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవన ప్రమాణాలు మార్చాలన్న ఆకాంక్ష తప్ప. కష్టపడి సంపాదించిన సొమ్మును సైతం ప్రజల కోసం ఖర్చు చేస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ని వివ‌రించారు. భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, రాజధాని రైతుల సమస్యలపై పోరాడార‌ని, రాజకీయ నాయకుడు అనే వాడు ఎలక్షన్ కోసం పోరాడతార‌ని, కాని పవన్ కళ్యాణ్ వంటి గొప్ప నాయకుడు ముందు తరాల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తార‌ని పేర్కొన్నారు. జ‌న‌సేన‌లో మేధావులు, బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల ప్ర‌జ‌లు, మ‌హిళ‌లు చేరాల‌ని, దుష్ట వైసీపీని ఇంటికి పంపించే వరకు మనందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో చిలకలూరిపేట మండల ఉపాధ్యక్షులు తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, నాదెండ్ల మండల అధ్యక్షులు కొసన పిచియ్య, యడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మల్లా కోటి, పట్టణ నాయకులు గోవిందు గణేష్, పగడాల ఎస్ ఆర్ శ్రీను, ముద్దా యోబు, వెంకటేష్, సాయి, వీర మహిళా నాయకులు అమరేశ్వరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.