కిడ్నీ వ్యాధి బాధితునికి జనసేన సాయం

పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలం, వెంగాపురం గ్రామస్తులు బూడుమూరు తవిటిరాజు గత కొద్ది రోజులుగా రెండు కిడ్నీలు ఫెయిలయ్యి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తన పేదరికం ఒక వైపు, ఇద్దరు చంటి పిల్లలు ఒక వైపు, తన అనారోగ్యం మరోవైపు ఆ కుటుంబాన్ని మానసికంగా చిదిమేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు జేఎస్పీ మరియు పార్వతీపురం నియోజకవర్గ నాయకులు అక్కివరపు మోహన్ రావు ఆ కుటుంబానికి 5000 రూ.ల తక్షణ సాయం అందిస్తూనే మీకు మరింత చేదోడుగా జనసేన పార్టీ తరపున నిలబడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, రగుమండ అప్పలనాయుడు, శంబాన హరిచరణ్, శివ, ప్రగడ కళ్యాణ్, అల్లు రమేష్, ఆది, పాలూరు వెంకటేష్, త్రినాథ్, గార గౌరీ శంకర్, సత్య తదితరులు పాల్గొని, చావు బ్రతుకుల మధ్య ఉన్న తవిటిరాజుకి, తన కుటుంబానికి సహాయపడాలనుకునేవారు నిండు మనసుతో తక్షణమే సాయం అందించమని కోరడం జరిగింది.