ఇల్లు లేక బాత్రూమ్ లో నివసిస్తున్న నిరుపేదకు జనసేన సాయం

ఆముదాలవలస: బూర్జ మండలం, నీలంపేట గ్రామంలో, జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, ఎంపీటీసీ విక్రమ్ మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక బాధాకరమైన సంఘటన చోటు చేసుకొంది.. ఉండడానికి ఇల్లు లేక బాత్రూమ్ లో నివసిస్తున్న నిరుపేద వ్యక్తిని చూసి చాలా బాధ అనిపించింది. ఇలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని మరియు అతనికి కొంత ఆర్థిక సాయం చేసి త్వరలో మీ కొడుకులుగా మేము జనసేన పార్టీ తరుపున ఎల్లపుడూ తోడుగా ఉంటాం అని జనసేన నాయకులు అతనికి భరోసా ఇవ్వడం జరిగింది.