టీటీడీ ఉద్యోగుల న్యాయపరమైన పోరాటాలకు మద్దతుగా జనసేన

టీటీడీ గత దశాబ్ద కాలానికి పైగా సొసైటీల (డేటా ఎంట్రీ ఆపరేటర్లు టైపిస్ట్లు, సీసీటీవీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు, విజిలెన్స్ సిబ్బంది, అన్నదానం క్యాంటీన్ సిబ్బంది, హాస్టల్ సిబ్బంది, అటవీశాఖ కార్మికులు, ఎలక్ట్రికల్ మరియు వాటర్ వర్క్స్ కార్మికులు, ట్రన్స్ పోర్టు సిబ్బంది, వెండర్స్, తిరుమల నిర్వాసితులు, మేళం సిబ్బంది, ఉద్యానవన సిబ్బంది, ముద్రణ సిబ్బంది, డిటిపి ఆపరేటర్లు, పూర్ హోమ్ సిబ్బంది, శ్రవణం సిబ్బంది, పోటు కార్మికులు, ఆలయ సిబ్బంది, సమాచార కేంద్ర సిబ్బంది, ఆఫీస్ సబార్డినేట్స్ మెత్తం -4500 మంది) ద్వారా, కాంట్రాక్ట్ పద్ధతిలో ఇండివిడ్యువల్ అగ్రిమెంట్ క్రింద(టీచర్లు, లెక్చరర్స్, డ్రైవర్స్, డాక్టర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మీరాశి- నాన్ మీరాశి అర్చకులు, పీస్ రేట్ బార్బర్లు, ప్రోగ్రాం బెస్డ్ కళాకారులు, మెత్తం-2500 మంది), అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా (వైద్య సిబ్బంది, మ్యూజియం సిబ్బంది మెత్తం 1000 మంది), వర్క్ కాంట్రాక్ట్ (పారిశుద్ధ్య కార్మికులు, సులబ్ యఫ్.మం.యస్ కార్మికులు, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ మెత్తం 7000 మంది) ద్వారా టిటిడిలో పని చేస్తున్నారు.

టిటిడిలో పనిచేస్తున్న కార్మికులకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి టైం-స్కేల్, రెగ్యులరైజేషన్ హామీని అమలు చేయాలని టిటిడి బోర్డును మరియు యాజమాన్యాన్ని కార్మికులు కోరుతున్న తరుణంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోగా కార్పొరేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నది టిటిడి యాజమాన్యం.
ఈ కార్పొరేషన్ విలీనం ద్వారా దాదాపుగా 7500 మంది ఉద్యోగులకు, వారి కుటుంబాలకు అన్యాయం చేస్తుంది టిటిడి. మా యెక్క సర్వీసును కోల్పోవడం జరుగుతుంది, టీటీడీకి మాకు ఉన్నటువంటి యజమాని-ఉద్యోగి సంబంధం కోల్పోవడం జరుగుతుంది. కార్పొరేషన్ లో విలీనం చేయడం వల్ల భవిష్యత్తులో మేము కార్పొరేషన్ ఉద్యోగులుగా పరిగణింపబడతాము కానీ టిటిడి ఉద్యోగులుగా పరిగణింపబడము. కార్పోరేషన్లో కొత్త ఉద్యోగిగా చేరవలసి వస్తుంది. పై విషయాలన్నీ టీటీడీ ఉన్నతాధికారులతో జరిగిన చర్చలలో వివరించినప్పటికీ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుంది.

టిటిడి యాజమాన్యం వర్క్ కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయు 7000 మంది ఎవరైతే కాంట్రాక్టర్ల వేధింపులకు గురి అవుతున్నారో వారిని కార్పొరేషన్లో విలీనం చేయడం లేదు. కార్పొరేషన్లో విలీనం వల్ల లబ్ధి కలిగే వారిని విలీనం చేయక పోవడం గమనార్హం.

టీటీడీ యాజమాన్యం కార్పొరేషన్ వల్ల లబ్ధి పొందే వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగులైన 7 వేల మందిని కార్పొరేషన్లో విలీనం చేయకుండా, ఇదివరకే దశాబ్ద కాలముపైగా అన్ని ప్రయోజనాలు పొందుతున్న 7500 మంది సొసైటీలు, కాంట్రాక్టు ఉద్యోగులను కార్పొరేషన్లో విలీనం చేయడం అమానుషం, అమానవీయం, సహజ సూత్రాలకు వ్యతిరేకం.

టిటిడి యాజమాన్యం గతంలో 5 సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులకు ఏ విధంగా అయితే డి.ఎ, హెచ్.ఆర్.ఎ తో కూడిన టైం స్కేల్ అమలు చేశారు అదేవిధంగా టీటీడీలో వివిధ పద్ధతులలో పనిచేసే ఉద్యోగులందరికీ టైం స్కేల్ ఇవ్వాలని కోరుచున్నాము.

వీరి యొక్క న్యాయపరమైన కోర్కెలను అమలు చేయాలని టీటీడీ బోర్డును, యాజమాన్యాన్ని మరియు ప్రభుత్వాన్ని కోరుతున్న సందర్భంగా జనసేన పార్టీ వీరికి మద్దతుగా ప్రభుత్వాన్ని వీరి న్యాయపరమైన కోరికలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎడి బిల్డింగ్ వద్ద చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ డా. పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇన్చార్జి శ్రీ కిరణ్ రాయల్, రాజారెడ్డి, హేమకుమార్, ఆనంద్, కీర్తన, సుమన్, మునుస్వామి, మరియు జనసైనికులు మనోజ్, బాల, హేమంత్ కుమార్, బాలాజీ, దిలీప్ రాయల్, విష్ణు, రవి రాయల్ తదితరులు పాల్గొన్నారు.