విద్యార్థులకు సహాయం చెయ్యడానికి జనసేన ముందుంటుంది

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట మార్కెట్ యార్డ్ వెనకాల ఉన్న బాలికల పాఠశాల యందు ఫిల్టర్ వాటర్ మోటార్ పనిచెయ్యకపోవడంతో హెచ్ ఎం సమాచారం మేరకు జనసైనికుడు నంద్యాల హరి ఆధ్వర్యంలో రాజంపేట జనసేన నాయకులు కోలాటం హరికృష్ణ సహకారంతో మోటార్ మార్చడం జరిగింది. కార్యక్రమంలో హెచ్ ఎం జయలక్ష్మి అమల, భారతి, కాంచన మేడం, జనసైనికులు మన్నేరు సూరిబాబు, ముత్యాల చలపతి, పూల మురళి, గురు, గాజుల మల్లికార్జున, అబ్బిగారి గోపాల్, నరసింహ పాల్గొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కోలాటం హరి కృష్ణ మాట్లాడుతూ చదువుకునే పిల్లలకి ఎటువంటి సహాయం కావాలన్నా జనసేన ఎప్పుడు ముందుంటుందని ముఖ్యంగా బాలికలు చదువులో ముందుండాలని వాళ్ళ అభ్యున్నతకి కృషి చేయాల్సిన బాధ్యత మనందరిమీదా ఉందని చెప్పారు.