బడుగు బలహీనులది జనసేన

  • బడుగు బలహీనులది జనసేన అనేందుకు ఉదాహరణ ఈ సగర సంతతి బిడ్డ విజయ గాధ..

పిఠాపురం: మొగిలి అప్పారావు మొట్టమొదటిసారి జనసేన జెండా పట్టిన వేళ.. తన వారి నుంచే ఎదురైన మొదటి మాట అది మన పార్టీ కాదు జండా మొయ్యడానికి తప్ప జననాయకుడిగా అవకాశం ఉండదు అని.. కాదు అని నిరూపించడానికి పట్టిన క్షణం ఎంపీటీసీగా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహించిన సందర్భం..
డబ్బులు వృధా చేసుకోవడం తప్ప పార్టీ పెద్దల దృష్టిలో గుర్తింపు ఉండదు అనే మరో మాట ఎదురయ్యింది తలా నోట.. పెదవి చిట్లించిన తలలకు.. నొసలు ఆశ్చర్యపోయేలా జనసేన పార్టీ అప్పారావు సేవలను గుర్తించిన విధానం జిల్లా సెక్రటరీగా నియమించి గౌరవించడం.. అంతటితో సరి.. అంతకుమించి నీపై ఉండదు ఏ గురి.. నిరూపించు మరోసారి.. కనీసం మీ అధ్యక్షుని దగ్గరకు అయినా చేరి.. అన్నాయి కొన్ని కంఠగింపు స్వరాలు.. అన్న పలువురి అభిప్రాయాలు పటాపంచలు చేస్తూ అధినేత అప్పారావు గారిని దగ్గరగా చేర్చుకోవడమే కాదు కరచాలనంతో సరిపెట్టడం అంతకన్నా కాదు.. తను పుట్టిన జాతి యొక్క కష్టాలను, ఎదుర్కొంటున్న వైశమ్యాలను, తమకు న్యాయ పరంగా ప్రభుత్వం నుంచి అందవలసిన ఫలాలు పెడదారి పడుతున్న వివరాలను సమగ్రంగా తెలుసుకుని తప్పక పోరాడదాం మన ప్రభుత్వం వచ్చాక పూర్తి న్యాయం చేద్దాం అని హామీ కూడా ఇవ్వడం జరిగినది.. ఇంతకంటే ఏం చెప్పాలి నిస్వార్ధంగా చేసే జనసైనికుల ప్రయాణం నిజాయితీ కలిగిన పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తున్నారు అని చెప్పడానికి.. అందుకే సగర్వంగా చెప్తున్నాము.. జై జనసేన, జై జై పవన్ కళ్యాణ్.