జనసేనతోనే నూజివీడు అభివృద్ధి

*నూజివీడు అభివృద్ధి వైయస్సార్ సిపి, టిడిపి వల్ల కాదు జనసేన వల్లే సాధ్యం
*ప్రెస్ మీట్ లో నియోజకవర్గం జనసేన నాయకులు మరీదు శివ రామకృష్ణ, తోట వెంకట్రావు, ఆరేల్లి కృష్ణ, యర్రంశెట్టి రాము, ఎం సునీల్ కుమార్ మాట్లాడుతూ…
*రెండు ప్రభుత్వాల హయాంలో నూజివీడు అభివృద్ధికి నోచుకోలేదు.
*ప్రశాంతంగా ఉండే నూజివీడులో అలజడులు సృష్టించి, శాంతిభద్రతలు విగతం కలిగించారు
*అభివృద్ధి చేయటానికి పాలకపార్టీ, సమస్యల మీద పోరాటానికి ప్రతిపక్ష పార్టీగా ఉన్న టిడిపి రోడ్లమీదకు రాలేదు కానీ పనికిమాలిన సమస్య మీద మాత్రం రోడ్లపైకి వచ్చారు.
*నూజివీడు అభివృద్ధిపై ఎవరు ప్రశ్నిస్తుంటే మా ఎమ్మెల్యే కి బాగా కాలుతున్నట్లు ఉంది.
*నూజివీడు నియోజకవర్గానికి అన్యాయం చేయం. నూజివీడు అభివృద్ధి చేసింది నేనే …నూజివీడు ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు అని ఎమ్మెల్యే తెగ ఊగి పోతున్నారు. నూజివీడు అభివృద్ధికి ఏమి చేసారో రెండు పార్టీలు సమాధానం చెప్పాలి.
*ఈ క్రింది సమస్యలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రతాప్, టిడిపి నియోజకవర్గం ఇంచార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇద్దరు సమాధానం చెప్పాలి.
*కృష్ణా జిల్లా పుట్టినప్పటినుంచి కృష్ణా జిల్లాలో భాగంగా ఉన్న నూజివీడు ఏలూరు జిల్లా పోతుంటే ఎందుకు ఆపటం లేదు. నూజివీడు ప్రజలు విజయవాడ జిల్లాలో ఉండాలని కోరుకుంటున్నారు. మరి మీరు ఎందుకు స్పందించడం లేదు..? ఇది నూజివీడుకి జరుగుతున్న అన్యాయం కాదా..?
*డిఎస్పి కార్యాలయం జంగారెడ్డిగూడెం తరలిస్తుంటే మీరు ఎందుకు మాట్లాడటం లేదు..?
*ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం ,జిల్లా సబ్ కోర్టులు & ఇతర 14 రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఏలూరు పోతుంటే ఎందుకు ఆపడం లేదు, ఇవి నూజివీడు ప్రజలు వద్దని మీతో చెప్పారా…?
*మీరే స్వయంగా మెడికల్ కాలేజీ నూజివీడుకి ఇస్తా అన్నారు అది నూజివీడు ప్రజలు వద్దన్నారని వేరే జిల్లాకు పంపించారా…?
*అసాంఘిక కార్యక్రమాలకి నిలయంగా మారిన ఇండోర్ స్టేడియం ఎప్పుడు పూర్తి చేస్తారు. ఇది క్రీడాకారులు నూజివీడు ప్రజలు వద్దని చెప్పారా…? ఎందుకు దశాబ్దాలుగా అలా పడి ఉంది…?
*నూజివీడు రోడ్లు బాగు చేయొద్దని ప్రజలు చెప్పారా…? ఎందుకు మీరు కొత్త రోడ్లు పోయడం లేదు ప్రజలు వద్దన్నారా…? దీనిని అభివృద్ధి అంటారా…?
*టౌన్ ప్రజలకు టిట్కో ఇల్లు ఎప్పుడు ఇస్తారు..?
*చాట్రాయి మండలంలో తాగునీరు, సాగునీటి సమస్య ఉంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు, తమ్మిలేరు ద్వారా నీటి సరఫరా అందించడం ఎప్పుడు చేస్తారు…? ఇదేనా అభివృద్ధి…?
*ముసునూరు మండలంలో మిరప పంట వేలాది ఎకరాల్లో దెబ్బతింది రైతులకు నష్టపరిహారం చెల్లించారా…?
*ఆగిరిపల్లి మండలంలో బ్రహ్మ లింగం చెరువు అభివృద్ధి చేసి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారా…?
*ముసునూరు, చాట్రాయి మండల కేంద్రాల్లో కనీసం బస్టాండ్ లేదు.. ఇదేనా అభివృద్ధి…
*ఆగిరిపల్లి ప్రధాన కూడళ్లలో మురికి నీరు మురికి నీరు ప్రవహిస్తుంది… ఇదేనా అభివృద్ధి..?
*నూజివీడు, ముసునూరు మండలం వేలాది ఎకరాలకు పట్టాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య పరిష్కారం చేయరా…?
*అధికారంలోకి రాగానే రావిచర్ల సరిహద్దు సమస్య పరిష్కారం చేస్తా అన్నారు. మూడు సంవత్సరాలు అయింది. ఇంకా అధికారం రాలేదా…?
పై అభివృద్ధి పనులు పై సమస్యలను పరిష్కారానికి రెండు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఈ రెండు పార్టీలకు నాయకులకు నూజివీడు అభివృద్ధి చేశామని చెప్పే మాట్లాడే అర్హత లేదనీ, ఈ రెండు పార్టీ నాయకులను గ్రామాలకు వస్తే నూజివీడు జరిగిన అభివృద్ధిపై ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో….. జనసేన పార్టీ నూజివీడు, చాట్రాయి, ఆగిరిపల్లి మండల అధ్యక్షులు యర్రంశెట్టి రాము, ఆరేల్లి కృష్ణ, జలసూత్రం పవన్, జనసేన నాయకులు మరీదు శివ రామకృష్ణ, తోట వెంకట్రావు, ఎం సునీల్ కుమార్, ఏనుగుల చక్రీ తదితరులు పాల్గొన్నారు.