బొర్రా రాజకీయ భవిష్యత్తుకు జనసేనాని హామీ

  • నెరవేరిన బొర్రా కోరిక
  • రాజీనామా తిరస్కరణ
  • పార్టీలో గౌరవం సమచిత స్థానం కల్పిస్తానన్న జనసేనాని

పిఠాపురం ప్రచారంలో భాగంగా శుక్రవారం పిఠాపురం చేరుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బొర్రా వెంకట్ అప్పారావుని ఎంతో ఆప్యాయంగా పలకరించి, ఆలింగనం చేసుకుని, మాట్లాడుతూ మీ రాజీనామా తనను బాధించిందని, మీ రాజీనామాన్ని తిరస్కరిస్తున్నాను మీకు పార్టీలో సముచిత స్థానము మరియు మీ రాజకీయ భవిష్యత్తుకు నాది హామీ అని నీలాంటి మెగా అభిమానులు పార్టీకి ఎంతో అవసరం అని, అలాగే పార్టీకి బొర్రా వెంకట్ అప్పారావు గారి సేవలను కొని ఆడుతూ.. మీరు పార్టీని సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎంతో పట్టిష్టపరిచారు. మీరు నాతో ఉండండి మీ భవిష్యత్తు నేను చూసుకుంటాను అని పవన్ కళ్యాణ్ గారు బొర్రాకి మాటిచ్చారు. బొర్రా పవన్ కళ్యాణ్ గారితో మీరు పిఠాపురంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలని దత్తాత్రేయ స్వామిని కోరుకుంటున్నానని నేను మీ గురించి శ్రీ రాజశ్యామలా దేవి యాగం ఐదు రోజులు కూడా చేశానని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారికి మీ సంపూర్ణ మద్దతు తెలియజేయమని పవన్ కళ్యాణ్ గారు బొర్రా కి చెప్పడం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ గారి గెలుపు కోసం గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నానని కన్నా లక్ష్మీనారాయణ గారి గెలుపు కోసం ఆయనతో కలిసి పని చేస్తున్నానని, కన్నా లక్ష్మీనారాయణ గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలవబోతున్నారని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసిన బొర్రా.