కొటికలపూడి గోవిందరావుతో జె.ఎస్.పి గ్లోబల్ టీం జూమ్ సమావేశం

  • జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో 7వ జూమ్ సమావేశం
  • జూమ్ సమావేశంలో పాల్గొన్న 16 దేశాల జనసేన నాయకులు

జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో ఆ టీమ్ ఫౌండర్ సురేష్ వరికూటి అధ్యక్షతన పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు(చినబాబు) తో శనివారం జె.ఎస్.పి గ్లోబల్ టీం జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. తమ తమ దేశాల నుండి ఒక్కొక్కరిగా సేవలు అందించడం కంటే అందరూ సంఘటితమై ప్రపంచ వ్యాప్తంగా అన్ని టీంలు కలిసి ఒక్క టీంగా వెళ్ళాలి అనే ముఖ్యలక్ష్యంతో ఏర్పడినటువంటి “జె.ఎస్.పి గ్లోబల్ టీం” నుండి వివిధ దేశాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నటువంటి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు(చినబాబు)తో ఎన్నారై జనసేన నాయకులు వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. 2019 లో జరిగిన ఎన్నికలలో 8000 ఓట్ల తేడాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయానికి దూరమయ్యామని మరి 2024లో ఏ విధంగా సిద్ధమవుతున్నారని ప్రశ్నించగా మనం 15 రోజుల ముందు మాత్రమే అనౌన్స్ చేయడం వలన ప్రజలకి తెలియకపోవటం వలన మనం మిస్ అయ్యాం, కానీ ఈసారి తప్పకుండా అధినేతని గెలిపించుకొనేలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని మరియు ఒక సిఎం హోదాతో శాసనసభలో అడుగు పెట్టేలా కృషి చేస్తున్నామని కొటికలపూడి గోవిందరావు చెప్పారు.

  • మనతో నడిచే ప్రతి జనసైనికుడు ఆర్ధికంగా బలపడటానికి ఉద్యోగంలో ఎదగడానికి నైపుణం పెంపొందించుకునేలా యువతకు మార్గదర్శకంగా ఉండాలని తెలిపారు.
  • పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గురించి ఇంకా ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుందని చర్చించడం జరిగింది. భద్రత పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వానికి వినతినివ్వడం జరిగింది. కానీ ప్రతి జనసైనికుడు కూడా సోషల్ మీడియాని ఉపయోగించుకొని నరేంద్ర మోడీని రిక్వెస్ట్ పంపాలని చెప్పడం జరిగింది.
  • పవన్ కళ్యాణ్ ఏదైనా మీటింగ్ కి వచ్చినప్పుడు ప్రతి జనసైనికుడు తన ప్రేమను స్ట్రాటజిక్ గా చూపాలి. అధినేత మీద ప్రేమ ఆయనకి బలమవ్వాలి కాని ఆయనని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని తెలిపారు.
  • జనసేన పార్టీ గుర్తు అయినటువంటి గాజు గ్లాసు గుర్తును మరింత బలంగా ప్రజలలోనికి తీసుకెళ్ళే విధంగా ప్రతీ ఊరిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం వద్ద గ్యాస్ బెలూన్ లు ఏర్పాటు చేసే విధంగా పని చేయడానికి ఆయన తనవంతు సహకారమందిస్తానని తెలిపారు.
  • క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేవిధంగా ఓటర్ లిస్ట్ అనాలసిస్ చేయడానికి, పోల్ మరియు బూత్ మేనేజ్మెంట్ పై గైడెన్స్ ఇస్తామన్నారు.
  • ఇంకా ప్రజల సమస్యల మీద పోరాటాలు, ర్యాలీలు చేద్దామఅంటే ప్రస్తుతం ఉన్న వైసిపి ప్రభుత్వం భయపడి కేసులు పెట్టటం వలన, ఆచి తూచి అడుగు వెయ్యాల్సి వస్తుందని అన్నారు.
  • జనసేన పార్టీలోని ప్రతి అంశాన్ని ప్రజలకు బాగా అర్ధమయ్యేలా వివరించాలని తెలిపారు.
  • మన ఎదుగుదలను ఏదో విధంగా ఆపడానికి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు వచ్చి కలిసి ప్రజల్ని కన్ఫ్యూస్ చేసినా సరే.. మనం మాత్రం 2024లో ప్రతి నియోజకవర్గాల్లో గెలిచేలా మన పోరాటం మనం చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

ఈ సమావేశంలో యూఏఈ నుండి పాపోలు అప్పారావు, మొగళ్ళ చంద్రశేఖర్, జాన్ బాబు, ఎన్.ఎల్ సత్య, జర్మనీ నుండి సుధాకర్ వరికూటి, ఉదయ్ కట్రెడ్డి, బాల సుబ్రహ్మణ్యం, అఖిల్ ఆవుల, చంద్ర మహేష్, మహేష్ కెకె, యూకె నుండి నాగ రమ్యకాంత్ నామన, పద్మజ రామిశెట్టి, వడ్రాణం నాగరాజు, శ్రీని దర్నాల, ప్రసన్న, శ్రీనాథ్ వట్టికూటి, సాయి నాయుడు, బాల నల్లి, భాను, ఆస్ట్రేలియా నుండి ఫణిరాజ్ సరోజిని, భాను, సౌత్ కొరియా నుండి డా.కె.నవీన్ కుమార్, వంశీ, సింగపూర్ నుండి గిరిధర్ సారాయి, కోనాల కాళీకృష్ణ, సూరిబాబు, ఇండియా నుండి ప్రభావతి వసంతాల, రత్న పిల్లా, అమెరికా నుండి శేఖర్ పిల్లా, లక్ష్మి నాగ్, రాజేష్ యాల్లబండి, మలేషియా నుండి పుల్లారావు, కెన్యా నుండి ప్రవీణ్ మొగసాటి, స్వీడన్ నుండి హర్ష, రామ్ మరియు వివిధ దేశాల నుండి పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.