జనసేన ఐటీ – ఆత్మీయ సమావేశం

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం, వైష్ణవి హోటల్ గ్రాండ్ నందు పి.ఎ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన జనసేన ఐటీ మిత్రుల సమావేశానికి బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా వారిఉ మాట్లాడుతూ జనసేన ఐటీ మిత్రుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన అందరికి నమస్కారం.ఐ టీ మిత్రులందరికీ నా విన్నపం మన గుర్తు గాజు గ్లాస్ గుర్తును జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. జనసేన ఇక్కడ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీకి స్వచ్ఛందంగా పనిచేసి మొత్తానికి కూకట్పల్లి నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ అధ్యక్షులు మిర్యాల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షలు మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజలింగం, ప్రచార కమిటీ చైర్మన్ కళ్యాణం శ్రీనివాసరరావు (కె.కె), ప్రోటోకాల్ చైర్మన్ బాబీ, బోలిశెట్టి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి సాగర్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, ఐటీ మిత్రులు, స్టేట్ ఐటి కో-ఆర్డినేటర్ పెన్నమరెడ్డి నాగబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐటి కో-ఆర్డినేటర్ గాలిదేవర తమ్మేష్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ కలయిక

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం, కె.పి.హెచ్.బి కాలనీ, కె.పి.హెచ్.బి ఫంక్షన్ హాల్ నందు ఆత్మీయ కలయిక కార్యక్రమంలో బిజెపి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి ముఖ్య అతిధిగా ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మీయ కలయికకు విచ్చేసిన సోదర, సోదరీమణులకు ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈ ఎన్నికలలో మీ ముందుకు వస్తున్నాను. సీటు తీసుకురావడమే నా వంతు, అది గెలిపించుకోవడం మీ వంతు అని అన్నారు. నేను గెలిస్తే మీరందరూ కూడా గెలిచినట్లే, కావున మీరందరూ నన్ను గెలిపించాలని కోరుచున్నాను. రాజ్యాధికారం దక్కాలంటే ప్రతి ఒక్కరిని కలుపుకుని పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ కలయిక కమిటీ సభ్యులు, బిజెపి నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరింత సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం,బేగంపేట్ డివిజన్, శ్యామ్ లాల్ బిల్డింగ్ లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి వినాయక( గణేష్ టెంపుల్ ) దేవాలయం సందర్శించి, ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని, శనివారం ఉదయం పాదయాత్రను బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రారంభించడం జరిగింది. బేగంపేట్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీతో పాదయాత్రను ప్రారంభించిన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ను ముందుగా భారీ గజమాలతో సత్కరించి బేగంపేట్ డివిజన్ నాయకులు, టాటా చారి కాలనీ, మేజెస్టిక్ మన్షన్, ప్రకాష్ నగర్, మయూరి మార్గ్, మాతాజీ నగర్ వరకు పాదయాత్రను కొనసాగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో బేగంపేట్ డివిజన్లో గత పది సంవత్సరాలుగా
అభివృద్ధికి నోచుకోలేదని మెయిన్ రోడ్డు మీద నుండి పోతూ ఉంటే బేగంపేట డివిజన్ చాలా అభివృద్ధి జరిగిందని అనుకుంటారు. కానీ అభివృద్ధి జరగలేదు. ఏ నాయకుడు వచ్చినా ఈ డివిజన్ ను అభివృద్ధి చేసింది శూన్యం. ఈ అధికార పార్టీ నాయకులు ఎక్కడ కబ్జా చేద్దాం అని చూస్తారు తప్ప అభివృద్ధి అనేది చేయరు. నేను రాజకీయాల్లోకి వచ్చింది, డబ్బు సంపాదన కోసం కాదని, నేను ఎక్కడి నుంచో వచ్చిన వాడిని కాదు. నేను స్థానికంగా గత 30 సంవత్సరాల నుంచి కుకట్పల్లి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. నిత్యం ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటూ ఇంకా సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తున్నాను. కూకట్పల్లి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయట్లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయకుండా మోసం చేశారు. చుట్టూ ఉన్న చెరువులను కబ్జా చేశారు. డ్రైనేజీ సమస్యలతో నిత్యం ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధి చేయకుండా, ఇక్కడ ఎమ్మెల్యే తమ సొంత వర్గాన్ని అభివృద్ధి చేశారు. ఈసారి అలా తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రజల మీద ఆధారపడి ఉంది. ఈసారి మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తు మీద వేసి నన్ను అఖండ మెజారిటీతో ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో గెలిపించాలని కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, ఎన్. సూర్య ప్రకాష్ రావు, ఎ.సూర్యారావు, యంజాల పద్మయ్య, గంగాధర్ గౌడ్, నందు, సత్యనారాయణ, వంశీ, మంత్రి కళావతి, సునీత, గోవింద్, శ్రీరామ్, బిజెపి నాయకులు, జనసేన నాయకులు, డివిజన్ నాయకులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.

కూన శ్రీశైలం గౌడ్ ప్రచారంలో పాల్గొన్న నందగిరి సతీష్

తెలంగాణ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జనసేన మరియు బీజేపీ బలపర్చిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు కూన శ్రీశైలం గౌడ్ ప్రగతి నగర్ మిథిలానగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం అనంత్ కుమార్, సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ నందగిరి సతీష్ తో పాటు జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. వీఎం రంగా సర్కిల్ ప్రగతినగర్ బీజేపీ కార్యాలయం కాకతీయ హిల్స్ నుంచి బైక్ ర్యాలీ మొదలై ప్రగతినగర్ నుండి ఎలిఫెంట్ సర్కిల్ మిథిలానగర్ కాలనీ మరియు బతుకమ్మ ఘాట్ మరియు మంకీ సెంటర్ మీదగా ర్యాలీ జరిగింది.

తాండూరులో పాదయాత్ర నిర్వహించిన నేమూరి శంకర్ గౌడ్

తెలంగాణ, తాండూరు, మల్ రెడ్డి పల్లి హనుమాన్ టెంపుల్ తాండూరు నియోజకవర్గంలో బీజేపీ బలపరచిన జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ జనసేన-బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. తాండూరులోని రామ్ మందిర్ ఇందిరా నగర్ నుండీ మల్లప్పమడి, శివాజీ చౌక్ మీదుగా బద్రప్ప గుడి వరకు తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జనసేన బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.