సామాన్యుడి పక్షాన గళం విప్పడానికే జనసేన-జనవాణి

కృష్ణాజిల్లా, పామర్రు నియోజవర్గం, సామాన్యుడి పక్షాన గళం విప్పడానికే జనసేన-జనవాణి, సమస్యలు నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి చెప్పుకునే అవకాశం. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు, పామర్రు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోండి. సమస్యలు జనసేన అధ్యక్షుల వారి దృష్టికి చెప్పండి. పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి తాడిశెట్టి నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారి పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సామాన్యుడి పక్షాన గళం విప్పేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజానీకం, ముఖ్యంగా మన పామర్రు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విజయవాడ బందరు రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య భవనంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. పార్టీ ప్రతినిధులు సమస్యను స్వీకరించిన రసీదు ఇచ్చి అదే రోజు సాయంత్రానికల్లా సంబంధిత అధికారులకు సమస్య చేరవేస్తారు. మరుసటి రోజు సమస్య పరిష్కారం అయ్యేలా పార్టీ కార్యాలయం నుంచి ఫాలో అప్ చేస్తారు. రాజకీయాలకు అతీతంగా సామాన్యుడికి అండగా నిలబడేందుకే జనసేన పార్టీ అధ్యక్షుల ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామాన్యుడికి అండగా నిలిచేందుకే జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఎన్నికల్లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేసే నిఖార్సయిన నాయకుడు పవన్ కళ్యాణ్,అందుకే జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎన్నో సమస్యలు ఆయన చెంతకు వచ్చాయి. నాడు టీడీపీ ప్రభుత్వంలో ఉండీ ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ఎత్తి చూపి ప్రజల పక్షాన నిలిచారు. నేడు ఇసుక సమస్య దగ్గర నుంచి అధ్వాన్నంగా మారిన రహదారుల వరకు, నేడు ఆత్మహత్య చేసుకుంటున్న కౌలు రైతుల వరకు అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారమే ధ్యేయంగా జనవాణి – జనసేన భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాస్తవానికి గతంలో ముఖ్యమంత్రులు వారంలో ఒక రోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు ఆలకించే వారు. మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి గాని, వారి ఆమాత్యులకు గాని, శాసనసభ్యులకు గాని అంత తీరిక లేదు. గడప గడపకు కార్యక్రమాన్ని ప్రజలు సమస్యలు చెప్పుకునే వీలు లేకుండా పోలీసులను పెట్టుకుని చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బహిరంగ సభల కోసం బయటకు వస్తున్న ముఖ్యమంత్రి వేల మంది పోలీసుల భద్రతా వలయంలో ఆ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. లక్షల కోట్ల రూపాయిలు అప్పులు తెచ్చి ప్రజల ధనాన్ని వారికి పంచి పెడుతూ… ప్రభుత్వ కార్యక్రమాలను రాజకీయ వేదికగా మార్చి పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్నారు. అంతకన్నా ధౌర్భాగ్యం ఏముంటుంది? అందుకే రాజకీయాలకు అతీతంగా.. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పామర్రు నియోజకవర్గం ప్రజలంతా ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని సమస్యలు పవన్ కళ్యాణ్ చెంతకు తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పామర్రు మండల అధ్యక్షులు గుంపా గంగాధర్ రావు, రాపర్ల్ ఎంపీటీసీ సభ్యులు కూనపరెడ్డి సుబ్బారావు, కృష్ణాజిల్లా కార్యదర్శి కాకి ఝాన్సీ, పామర్రు మండల ఉపాధ్యక్షులు రాయవరపు శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శులు మంచాల అనిత, తాడిశెట్టి సంధ్య, ఏనుగు వెంకటరత్నం, మేక రామారావు, కిట్టు, సాత్విక, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.