జనసేన జయభేరి కార్యక్రమానికి విశేష ఆదరణ

  • పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు వివరిస్తూ నగర ప్రజలకు భరోసానిస్తూ..
  • జనసేన జయభేరి కార్యక్రమానికి అడుగడుగున నీరాజనం…
  • పాతూరు అంబారపు వీధిలో తొలి రోజు దిగ్విజయంగా ప్రారంభమైన జనసేన జయభేరి

అనంతపురము అర్బన్: వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలను వివరిస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రజలను మమేకం చేస్తూ.. అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టీ.సి.వరుణ్ ఆధ్వర్యంలో చేపట్టిన జనసేన జయభేరి కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. ఆదివారం అనంత నగరంలోని పాతూరు తాడిపత్రి బస్టాండ్ వద్దనున్న చెన్నకేశవస్వామి దేవాలయంలో శ్రీ టి.సి.వరుణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అంబారపు వీధిలో జనసేన జయభేరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డప్పు వాయిద్యాల నడుమ టీ.సి.వరుణ్ గారి నాయకత్వంలో శ్రేణులు జనసేన జయభేరి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులు పడుతూ.. వరుణ్ గారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టి.సి.వరుణ్ ఇంటింటికి వెళ్తూ.. అందరిని పేరుపేరునా పలకరిస్తూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అదే సందర్భంలో వైసిపి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను అకృత్యాలను.. అర్హులైనప్పటికీ ప్రభుత్వ పథకాలను అందించడంలో చూపుతున్న పక్షపాత వైఖరిని తూర్పార బట్టారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలను వివరిస్తూ.. తాము అధికారంలోకి వస్తే అనంత నగరానికి చేసే అభివృద్ధిని పేర్కొంటూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టి.సి.వరుణ్ మాట్లాడుతూ.. వైసిపి అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అనంత నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధిని కూడా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిగా పేర్కొనడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల సమయంలో అనంత నగర అభివృద్ధికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా స్థానిక నాయకులు అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికే అర్హులైన వికలాంగులు వితంతువులు వృద్ధులకు పార్టీల పక్షపాతంతో పింఛన్లు రద్దు చేయటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలంటే అది జనసేనతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. మీకు అన్నివేళలా తాను అండగా ఉంటానని.. మీకు ఏ సమస్య వచ్చినా తాను ముందు నిలుస్తానని టీ.సి.వరుణ్ భరోసా ఇచ్చారు. అభివృద్ధిని మంట కలిపి స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్న అధికార వైసిపిని ఎదిరిస్తూ.. ప్రజలకు అండగా నిలుస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి జనసేన పార్టీని ఆదరించాలని టి.సి.వరుణ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క జనసైనికుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, రాప్తాడు ఇంచార్జ్ పవన్ కుమార్, తాడిపత్రి ఇంచార్జ్ శ్రీకాంత్ రెడ్డి, అనంతపురము జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు శ్రీ పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, కార్యదర్శులు సంజీవ రాయుడు, రాపా ధనుంజయ్, చొప్ప చంద్ర, కిరణ్ కుమార్, గౌతమ్ కుమార్, సిద్దు, అవుకు విజయ్ కుమార్, బాల్యం రాజేష్, ముప్పూరు కృష్ణ, నగర ఉపాధ్యక్షులు గ్రంధి దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శులు రొల్ల భాస్కర్, మేదర వెంకటేష్, వెంకటనారాయణ, హుస్సేన్, దరాజ్ భాష, కార్యదర్శులు లాల్ స్వామి, మురళి, రాజేష్ ఖన్నా, వడ్డే వెంకటేష్, కేశవ, వెంకటరమణ, నెట్టిగంటి హరీష్, ఆకుల ప్రసాద్, ఆకుల అశోక్, బళ్లారి అశోక్ కుమార్, పవన్ కుమార్, కార్యక్రమాల కమిటీ సభ్యులు ఎస్.క్.యు రమణ, వెంకటేష్, సంతోష్, మండల అధ్యక్షులు తోట ఓబులేసు, గంటా రామంజి, రామకృష్ణ, ఎర్రిస్వామి, నాయకులు గల్లా హర్ష, కాయగూరల విజయభాస్కర్, నేత్ర సీనా, సురేష్, శామీర్, చంద్ర, హిద్దు, మహేష్, బాబ్జాన్, సల్మాన్, సంపత్ టింకు, కట్ల శీన, కొండి శెట్టి ప్రవీణ్ కుమార్, చిరు, విజయ్ భాస్కర్, సురేష్, నరేష్, నజీమ్, మౌళినాథ్, దేవా రాయల్ విజయ్, పూలశెట్టి నారాయణస్వామి, బళ్లారి వెంకటేష్ మరియు వీరమహిళలు శ్రీమతి జెక్కిరెడ్డి పద్మావతి, శ్రీమతి అనసూయ, శ్రీమతి డోనే సరిత, మంజుల మరియు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.