ఏమయ్యా జగన్ రెడ్డి!.. అధికారం ఇచ్చిన పాపానికి ప్రజల్ని చంపేస్తారా..?: గునుకుల కిషోర్

కాపు సేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు పూసల మల్లేశ్వరరావు , జే.ఏ.సి తరఫున సాయిరాం కాపులకి ఇవ్వాల్సిన ఐదు పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలని, హరినామ జోగయ్య అరెస్టును నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షకు ప్రారంభించారు, దానికి మద్దతుగా జనసేన పార్టీ తరఫున గునుకుల కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కిషోర్ మాట్లాడుతూ.. తప్పం తిప్పం అని టప్పం మాటలు ఏమైపోయాయి..? ఈరోజు ఈ సామాజిక వర్గానికి జరిగిన ఈ అన్యాయం మరే వర్గానికైనా జరగొచ్చు. సామూహిక ప్రయోజనాల కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న నాయకులపై విరుచుకుపడుతున్న మీ విధానం చూస్తుంటే స్వాతంత్ర్యానికి పూర్వం మీ లాంటి వారు అధికారం లో ఉండి ఉంటే భారతావని లో మహాత్ములుగా పేరుగాంచిన నాయకులే కనబడే ఉండేవారు కాదు. ఇటువంటి చర్యలు చేస్తే చరిత్ర హీనులుగా మిగులుతారు ఎనిమిది పదులు వయసులో సామాజిక న్యాయం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న జోగయ్య గారిని అరెస్టు చేయడం పాపం అనిపించలేదా…..?, విచక్షణ మరిచిపోయి ఆ వయసు వారిపై మీరు వారిని అరెస్ట్ చేయడం అమానుషం..!. దీనినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలకి అన్యాయం జరుగుతూనే ఉంది. రావాల్సిన రిజర్వేషన్లు అందక బీసీ బిడ్డలు పాలిటెక్నిక్ ఎగ్జామ్ కి హాల్ టికెట్ తెచ్చుకోలేక పోయారు.మైనార్టీ సోదరులు చూస్తే వారి బిడ్డలకు ఇస్తానన్న స్కాలర్షిప్లు ఎక్కడికి పోయాయి మీ అంటూ వీధిన పడ్డారు. జనసేనకు మద్దతు ఇస్తే వికృతంగా పైన పడతారు జనసేనకు మద్దతు ఇచ్చిన దళిత నాయకుడు మహాసేన రాజేష్ పై దాడి చేస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత మీ విధ్వంశాలు మీ పార్టీ వినాశానికి కారణం అవుతాయి. ఐదు పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఇవ్వలేనని కచ్చితంగా ప్రకటించారు. కాపుల పిల్లలకు విదేశీ యానాని కి అవసరమైన రుణాలు ఏర్పాటు చేయలేకపోయారు. కాపుల నిధులను వేరే వాళ్లకు మళ్ళించి మెండి చేయి చూపించారు. సమూహ ప్రయోజనాల కొరకు దీక్ష చేస్తున్న ఆ వయసు వారిని వీలైతే బుజ్జగించాలి లేకపోతే హామీలు ఇవ్వాలి కానీ ఇలా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ కక్ష సాధింపు దోరణి, ప్రజలను ఇబ్బంది పెట్టి సంతోష పడే పరిస్థితిలో జగన్ ఉన్నారు. ప్రజలందరూ దీనిని గమనించి రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నానని కిషోర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున నాయకులు గునుకుల కిషోర్, ప్రశాంత్ గౌడ్, కంథర్ వర్షన్, అమీన్, మౌనిష్కాపు సంక్షేమ సమితి సేన తరపున హజరత్, అనీల్, బండి అనీల్, మహేష్, శ్రీనివాసులు, అజయ్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.