శతఘ్ని న్యూస్ టీంని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

మంగళగిరి, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని శతఘ్ని న్యూస్ టీం సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు కలవడం జరిగింది. శతఘ్ని న్యూస్ రెండు సంవత్సరాల పై నుంచి జనసేన పార్టీ ఎదుగుదలకు ప్రతి నియోజవర్గ స్థాయిలో, ప్రతి రోజు నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అడుగడుగునా చేస్తున్న ప్రజా పోరాటాలకు, జనసేన చేసే సామజిక సేవలను ఎప్పటికప్పుడు ఈ-పేపర్ మరియు సామాజిక మాధ్యమాల ద్వారా అనునిత్యం ప్రజలకు చెరవేయటం జరుగుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అధ్యక్షుల వారు గుర్తించి శతఘ్ని న్యూస్ టీంని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. రాబోవు ఎలక్షన్స్ లో సోషల్ మీడియా, ప్రచార మాధ్యమాలు ఎలక్షన్స్ విజయంలో ప్రత్యేక భూమిక పోషిస్తాయని, ఇప్పటికీ వరకు ఎలా ఐతే జనసేన బలోపేతానికి కృషి చేశారో అలాగే ముందుకు సాగాలని శతఘ్ని న్యూస్ టీంకి సూచించారు.