వాల్మీకి మహర్షికి నివాళులర్పించిన పెండ్యాల శ్రీలత

అనంతపురం, వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత ఆదివారం అనంతపురం నగరంలోని పాత ఊరులోని పవర్ ఆఫీస్ కూడలి వద్ద గల ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీమతి పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ 24,000 శ్లోకాలు, ఏడు కాండములతో మానవాళికి రామాయణం అనే అద్భుతమైన మహాకావ్యాన్ని అందించిన గొప్ప వ్యక్తి ఆదికవి వాల్మీకి మహర్షి అని కొనియాడారు. అదేవిధంగా వాల్మీకుల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ మన పక్క రాష్ట్రాలలోని వెనుకబడిన వాల్మీకి కులస్తులు ఎస్టీలుగా పరిగణించబడుతున్నారని కానీ మన రాష్ట్రంలోని వాల్మీకులు (బోయకులస్తులు) చాలా వెనుకపాటు తనానికి గురవుతున్నారని అధికారంలో వచ్చేకి మాత్రమే ఇతరపార్టీలవారు వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేరుస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాల్మీకి కులస్తులను విస్మరిస్తున్నారని జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని, పోయిన సభలలో కూడా మా అధ్యక్షులవారు వాల్మీకి కులస్తులు వెనుకబాటుకు గురవుతున్నారని వారిని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తాం అన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు, అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, అనంతపురం రూరల్ కన్వీనర్ గంటా రామాంజనేయులు, నాయకులు సాయి కుమార్, శ్రీనివాసులు, జయరామ్, దండు హరీష్ కుమార్, మధు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.