గొబ్బెమ్మ పండుగలో జనసేన నాయకులు

  • ఏటి ఒడ్డున 11 సంవత్సరాల వరకు తిరిగాను, స్కూల్ ఎగ్గొట్టి నదిలో ఈదటం.. అది తెలుసుకొని మా నాన్న రావడం.. బయటకొస్తే కొడతారని కొంత సేపు ఆలోచించి రాక పోవటం.. బట్టలు ఎత్తుకెళ్లిపోయిన నాన్నను చూసి బయటికి రావడం తన్నులు తినడం ఇవన్నీ గుర్తొచ్చాయి.. జానీభాయ్
  • మూడు రోజుల పెద్ద పండుగను కొనసాగిస్తూ నదిలో గొబ్బెమ్మలని కలిపి ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఇక్కడ విచ్చేసిన దేవతలను కోరుకోవటంతో మా పెద్ద పండుగ ముగుస్తుంది.. గునుకుల కిషోర్

నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గొబ్బిళ్ళ పండక్కి బుధవారం జనసేన నాయకులు గునుకుల కిషోర్, జానీ బాయ్, ఏటూరి రవికుమార్, కృష్ణారెడ్డి మరియు జనసేన జన సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. చాలా ఊర్లలో పెద్ద పండగ మూడు రోజులు జరుపుకుంటారు. కానీ మా నెల్లూరులో గొబ్బెమ్మ పండగతో కలిపి పెద్ద పండుగను నాలుగు రోజులు జరుపుకుంటారు. ఈ గొబ్బెమ్మ పండుగను మా నెల్లూరు ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. గొబ్బెమ్మలను పెన్నా నదిలో వదిలి ప్రజలంతా చల్లగా ఉండాలని పెద్ద పండుగ సారాంశం తెలియజేస్తారు. ఈ రోజు ఈ వేడుకకు మరింత శోభాయమానం జానీ మాస్టర్ ఇక్కడికి రావడం. ప్రజల్లోకి జనసేనను ముందుకు తీసుకుపోవడం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఇక్కడ అధిష్టిచ్చినటువంటి దేవతలను ప్రార్థించడం జరిగింది. బయట ఆవరణలో వైసిపి ఫ్లెక్సులు చాలా ఏర్పాటు చేసున్నారు, జనసేన ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాలని చూడడం అందుకు అధికారులు పోలీసులు పోలీసు యంత్రాంగం భారీ ఎత్తున మోహరించిన విధానం సబబు కాదని చాలా సేపు వాగ్వాదం తర్వాత ఫ్లెక్సీలు కట్టడానికి ఒప్పుకున్నారని, మొదట్లో వైసిపి నాయకులు ఫ్లెక్స్ వద్దంటే పర్యావరణ కాలుష్యం చెందుతుందని భయంతో అనుకున్నాము .ఇప్పుడు వారి ఫ్లెక్సీలు మాత్రమే ఉండాలి మిగిలిన వారివి ఉండకూడదో అనడంలో మాకు ఏమీ అర్థం అవడం లేదు. అధికారులు కూడా ఎవరికైనా ఒకే చట్టవర్తింపజేసినట్టు చూడాలి దాదాపుగా 65 ప్లస్ వైసిపి ఫ్లెక్సులు ఉంటే నాలుగైదు జనసేన ఫ్లెక్సీలు కట్టుకుంటే ఇబ్బంది ఏమిటి ఎవరితో అయినా ఒకే రకంగా వ్యవహరించాలి నాలుగు నెలలు కూలిపోతున్న ఈ ప్రభుత్వానికి వత్తాసు పలక వద్దని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జానీ భాయ్ మాట్లాడుతూ.. స్కూల్ ఎగ్గొట్టి నదిలో ఈదుతుంటే బట్టలు ఎత్తుకెళ్లిన నాన్న, బయటకు వస్తేనే బట్టలు ఇస్తానని చెప్పిన నాన్న, బయటికి వస్తే కొడతారని భయపడి ఆగడం, బట్టల కోసం బయటకు వచ్చి తన్నులు తినడం, ఇవన్నీ గుర్తొచ్చాయని అన్నారు. అలాగే చాలా సంవత్సరాల నుండి గొబ్బెమ్మ పండగ ఆచారంగా అంగరంగ వైభవం జరుగుతోంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వంగా, ఆనందంగా ఉంది అన్నారు. ఈ ఏటి ఒడ్డున 11 సంవత్సరాల వరకూ తిరిగానని, ఇక్కడ చేసిన చిలిపి చేష్టలు, ఇక్కడ పట్టిన చేపలను సొమ్ముగా మార్చుకొని చిన్న చిన్న ఖర్చుల కోసం ఉపయోగించుకున్నానని అవన్నీ గుర్తొస్తున్నాయని జానీ మాస్టర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, జనసేన నాయకులు జానీ మాస్టర్, జనసేన సీనియర్ నాయకులు చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏటూరి రవికుమార్, జనసేన అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, రామ్ చరణ్ యువత జిల్లా అధ్యక్షులు ప్రసాద్, సాయి ధరంతేజ్ యువత గుర్రం కిషోర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.