కుమ్మరి భీమయ్య ఇంటి నిర్మాణం గురించి చర్చించిన జనసేన నాయకులు

నాగర్ కర్నూల్ జిల్లా, తీమ్మజిపేట మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి భీమయ్య నివాసం గతంలో భారీ వర్షాల కారణంగా కూలిపోయిన సందర్భంలో వంగ లక్ష్మణ్ గౌడ్ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వారికి రెండు రేకుల ఇంటిని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా వంగ లక్ష్మణ్ గౌడ్ సూచనల మేరకు శుక్రవారం ఆ కుటుంబ సభ్యులను కలిసి పోతిరెడ్డిపల్లి గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబోయేటటువంటి ఇంటి నిర్మాణం గురించి మరియు అని ఆ కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి జనసేన గ్రామ నాయకులు, వంగ విజయ్ భాస్కర్ గౌడ్, ఎడ్ల శివ, ప్రసాద్, అల్తాఫ్, పవన్, భీముడు, బెల్లే అంజి, అబ్బా అంజి, అర్ శివ, గోపి, రమేష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.