నాగలదిబ్బ సమస్యలను అధికారులకు వివరించిన జనసేన నాయకులు

ఆచంట, నాగలదిబ్బ పరిస్థితి గురించి వార్తా పత్రికలో వచ్చిన కధనంపై స్పందించి కలెక్టర్ అదేశాల మేరకు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారి నాగలదిబ్బపై రిపోర్ట్ కోసం రావడం జరిగింది. వచ్చిన అధికారులను హైస్కూల్ వద్ద పొలమూరు జనసేన పార్టీ అధ్యక్షులు తోరం వెంకన్నబాబు, జనసేన నాయకులు తోరం సురేష్ మరియు ఇతర జనసేన నాయకులు జనసైనికులు కలవడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు స్కూల్ వెనకాల ఉన్న దుస్థితిని, పంచాయితీ ముందర ఉన్న డ్రైన్ పరిస్థితీ, ఆ డ్రైన్ నుండి లికులతో ఉన్న మంచి నీటి పైపు లైన్ సమస్య మరియు ఊరిలో మంచి నీటి కాలుష్యం గురించి వివరించారు. త్రాగు నీరు కాలుష్యం వల్ల, సరైన మంచి నీటి సరఫరా వ్యవస్థ లేక మరియు పారిశుధ్యం వ్యవస్థ నిర్వహణ లోపం వల్ల ఊరిలో ప్రజలు అనారోగ్యాలు బారిన పడుతున్నారని అధికారులకు వివరించి ఈ సమస్యలు అన్నిటినీ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళాల్సినదిగా కోరడం జరిగింది. మొత్తం వివరాలు విన్న అధికారులు కచ్చితంగా వీటిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది. నాగలదిబ్బలో నెలకొన్న పరిస్థితులపై పంచయితి అధికారులకు అక్షింతలు వేసినట్టు సమాచారం.