పోలింగు బూతు – 17లో కేంద్ర ఓటరు జాబితాను పరిశీలించిన జనసేన నాయకులు

పార్వతీపురం మున్సిపాలిటీ పోలింగు బూతు – 17 కేంద్ర ఓటరు జాబితాను పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు చందక అనిల్, నేయ్యిగాపుల సురేష్, మనేపల్లి ప్రవీణ్, కడగల శ్యాంసుందర్, సిరిపురపు గౌరీ తదితరులు. అనంతరం ఆ జాబితాలోని చేర్పులు, తొలగింపులు, బదిలీలు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్వోలుతో మాట్లాడి ఓటరు జాబితా లోని చేర్పులు, మరణాలు, తొలగింపులు, బదిలీలు తదితర వాటిపై చర్చించారు. ఎటువంటి తప్పిదాలు లేకుండా స్పష్టమైన, పరిపూర్ణమైన ఓటరు జాబితా రూపొందాలన్నారు. ఈ సందర్భంగా తన ఓటును జాబితాలో తనిఖీ చేశారు. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ డిసెంబర్ 9కి ఓటు నమోదు కార్యక్రమం గడువు ముగుస్తుంది. అందుకు 18 ఏళ్ళు నిండినవాళ్లు, జాబితాలో ఓటు లేని వాళ్ళు కొత్తగా చేర్చుకోవాలి. అలాగే ఓటరు జాబితాలో ఓటు ఉందో …? లేదో…? పరిశీలించుకోవాలి అని అలాగే ప్రతి ఒక్క ఓటరు చైతన్యం పొంది ఎన్నికల్లో ఓటును వినియోగించుకోవాలన్నారు. ఓటింగ్ శాతం పెరిగేలా చైతన్యం నింపుకోవాలన్నారు. అలాగే ప్రలోభాలకు లొంగని ఓటర్ల సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి అన్నారు.