తెలంగాణా విద్యార్థి విభాగంలో శతఘ్ని న్యూస్ పేపర్ ను ఆవిష్కరించిన జనసేన నాయకులు

తెలంగాణ జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ జనసేన విద్యార్థి విభాగం నాయకుడు సంపత్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శంకర్ గౌడ్, ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇంఛార్జి రామ్ తాళ్లూరి , పోలిట్ బ్యూరో సభ్యులు అర్హమ్ ఖాన్, ఉమ్మడి వరంగల్ ఇంచార్జ్ ఆకుల సుమన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శతఘ్ని న్యూస్ పేపర్ ని సంపత్ నాయక్ ఆద్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. శతఘ్ని న్యూస్ ని నాయకులందరూ కొనియడటం. జనసేన పార్టీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని శంకర్ గౌడ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో జనసైనికులు చేస్తున్న కార్యక్రమాలను వెలుగులోకి తీసుకురావటానికి మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతం అని జనసేన పార్టీ ఖమ్మం జిల్లా ఇన్చార్జి రామ్ తాళ్లూరి కొనియాడారు.