లబ్బంగి గ్రామస్థులతో సమావేశమైన జనసేన నాయకులు

పాడేరు: డా. గంగులయ్య సూచనల మేరకు లబ్బంగి గ్రామస్థులతో జనసేన పార్టీ నాయకులు సమావేశమయ్యారు. స్థానిక నాయకులు రాజుబాబు, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ ల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య, కిల్లో రాజన్, మసాడి భీమన్న తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా డా. గంగులయ్య మాట్లాడుతూ ప్రభుత్వానికి గిరిజన స్థితిపై శిత్తశుద్ధి లేదని గడిచిన నాలుగేళ్లలో మనమంతా చూసేసమన్నారు ప్రతి గిరిజన పౌరుడు వాస్తవిక రాజకీయాలపై క్షున్నంగా తెలుసుకోవాలని జాతి ఆస్తిత్వంపై జరిగే ప్రభుత్వాల కుట్రలను పసిగట్టి చర్యలు తీసుకునే నాయకత్వం మనకు వద్దని గిరిజన ప్రజలను చైతన్యవంతం చెయ్యాల్సిన బాధ్యతలు గిరిజన యువత తీసుకోవాలని అన్నారు. లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మాట్లాడుతూ మన హక్కులు, చట్టాలు మన ప్రాంత భౌగోళిక పరిస్థితులు తెలిసిన నేతగా గంగులయ్య గారిని చట్టసభల్లో పంపించగలిగితే కనీసం జాతిపై చట్టసభల్లో జరుగుతున్న నష్టాలపైన ఎదుర్కోవచ్చు ఇలా కాకుండా ప్రస్తుతం ఉన్న మన నాయకులు అసెంబ్లీలో వాదన ప్రతి వాదనలు జరుగుతుంటే దిక్కులు చూడటం, కిటికీలు చూస్తూ గడియరాలలో అంకెలు లెక్కబెడుతూ ప్రభుత్వం ఏది చెప్తే అదే శిరోదార్యమంటూ బానిసత్వం ప్రకటించడం చూస్తుంటే మన జాతి ని తాకట్టు పెట్టేసారని సామాన్య గిరిజనులకు కూడా అర్ధమవుతుంది. ఇలాంటి పాలకులు మనకు అవసరమా? ఈ సారి మనం మేల్కొకపోతే తగిలే దెబ్బకి భవిష్యత్ తరాలు నాశనం అయిపోతుంది ఇప్పటికైనా మేల్కొనండి అన్నారు. భీమన్న మాట్లాడుతూ మనమంతా పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలంటే కలిసి ప్రయాణం చెయ్యాలి మన గిరిజన అస్తిత్వం కాపాడుకోవాలి మన గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగకల్పన, గ్రామసీమల అభివృద్ధి కావాలంటే జనసేనపార్టీ ప్రభుత్వం స్థాపించాలన్నారు ఈ సందర్బంగా జనసేనపార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, నిర్దిష్ట్యా లక్ష్యాలు నచ్చి లబ్బంగి గ్రామస్తులు జనసేనపార్టీ కండువాలు డా. గంగులయ్య చేతులమీదుగా కప్పుకుని పార్టీ లోకి చేరారు వారికి సాదరంగా జనసేన పార్టీలో గంగులయ్య ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాజుబాబు, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, మసాడి భీమన్న, తాంగుల రమేష్, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, మజ్జి సత్యనారాయణ, మజ్జి సంతోష్, అశోక్, గూడెం మండల నాయకులు అరడ కోటేశ్వరరావు, వనగరి ఈశ్వర్రావు, చింతపల్లి నాయకులు, శెట్టి స్వామి, శేఖర్ తదితర జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.