వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు

గోపాలపురం నియోజకవర్గం: దేవరపల్లి మండలం, యాదవోలు గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవానికి గోపాలపురం జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మద్దిపాటి వెంకట రాజు, దేవరపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షులు కట్నం గణేష్ యాదవోలు జనసేన పార్టీ అధ్యక్షులు అనిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు నూతనపాటి శ్రీను, జనసేన పార్టీ మండల కార్యదర్శి సున్నం రాజు, యాదవోలు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి గోపాలకృష్ణ, జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మధు అనిశెట్టి, జనసైనికులు వివేక్ హాజరయ్యారు. ఈ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు 23, 24, 25 తారీకుల్లో యాదవోలు గ్రామ ఫ్రెండ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.