శ్రీ పోలేరమ్మ తీర్థ మహోత్సవాలలో పాల్గొన్న జనసేన నాయకులు

రావులపాలెం మండలం, పొడగట్లపల్లి గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తీర్థ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ పోలేరమ్మ తీర్థ మహోత్సవాలలో జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్, రావులపాలెం మండల అధ్యక్షులు తోట స్వామి, యర్రంశెట్టి రాము, పార్టీ పెద్దలు, గ్రామ జనసేన కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.