మీడియా మిత్రులపై దాడిని ఖండిస్తూ జనసేన నిరసన

  • మీడియా మిత్రులపై జరిగిన దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ వద్ద నిరసన
  • జగనన్న చొక్కా మడత పెట్టమన్నది ఇందుకు..?
  • మంచి వినకు, మంచి కనకు, మంచి మాట్లాడకు అనేది వైసిపి నినాదం
  • వాలంటీర్ వ్యవస్థ మీద ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారి మీద క్రిమినల్ కేసులు కక్షపూరితమైన చర్యలే..
  • ప్రజల సమస్యలను నిరంతరం పోరాడే మీడియా మిత్రులపై దాడి హేయమని చర్య
  • రెక్కలు ఊడిన రంగుల ఫ్యాను చెత్తబుట్టలో వేయండి

నెల్లూరు: జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా మడత పెట్టి దేనికి సిద్ధమవుతున్నారో తెలియడం లేదు చొక్కాలు మీకే కాదు మాకు ఉన్నాయి చెడ్డీలు వేసుకొని బిడ్డలకు చెప్పండి మేము చొక్కాలు మడత పెడతామని… మేము సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని ఇంటికి పంపించేందుకు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లోపించింది. వ్యవస్థపై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారి మీద క్రిమినల్ కేసు కట్టడం అమానుషం. ఇలాంటి వై సి పీ రౌడీ మూకల దాడి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కనపడదు. ఈ దాడికి కారణమైన ప్రతి ఒక్కరి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టాల్సిందే. ఈ దాడి మీడియా మిత్రులు పైగా జరిగిన దాడి కాదు ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడిగా పరిగణించి మీడియో మిత్రులకు జనసేన పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం.. మీడియా మిత్రులపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తల దాష్టికానికి మనం బుద్ధి చెప్పాల్సిందే. ఈ రౌడీ రాజకీయానికి స్వస్తి పలకాల్సిందే ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి శాంతి బద్రతలు కాపాడువాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను.. ప్రతి సంవత్సరం 1500 కోట్ల రూపాయలు వాలంటరీ వ్యవస్థకి వెచ్చిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ లో దీని కేటాయింపుల గురించి ప్రస్తావించకపోగా.. 1,02,836 మంది సచివాలయ సిబ్బంది వివరాలు తెలియపరచకపోవడం క్రిమినల్ చర్య అనడంలో తప్పులేదు. సం.నికి 617 కోట్ల రూపాయలు నెలకి 51 కోట్ల రూపాయల దుర్వినియోగం జరుగుతుందనిపిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా ఫీల్డ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఈ సంస్థ ఎవరికి రిపోర్ట్ చేస్తుంది సచివాలయ సిబ్బందికి ఏ పరిధిలోకి రాని సచివాలయం సిబ్బంది చేసిన తప్పులు ఎవరికి బాధ్యులు ఇప్పటికీ వివరం లేదు.. మీడియా మిత్రులకు సరైన న్యాయం జరిగే వరకు కూడా చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతుగా జనసేన నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సిటీ కార్యదర్శి కృష్ణవేణి, వీరమహిళలు రేణుక, హసీనా, నిర్మల, ప్రశాంత్ గౌడ్, వర్షన్, షాజహాన్, మౌనిష్, హేమచంద్ర యాదవ్, కేశవ, మౌనిష్, శ్రీను, బన్నీ, వరకాపు సంక్షేమ శాఖ అధ్యక్షులు సుధా మాధవ్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.