స్వర్గీయ పాఠంశెట్టి నారాయణరావుకు జనసేన నేతల ఘన నివాళులు

జగ్గంపేట: జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర తండ్రి స్వర్గీయ పాఠంశెట్టి నారాయణరావు గత కొన్ని రోజుల క్రితం మరణించారని వార్త తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడి శ్రీనివాస్ ఇతర జనసేన సీనియర్ నాయకులు పాఠంశెట్టి నారాయణరావు చిత్రపటానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించి, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని, మనోధైర్యాన్ని తెలియజేసారు.. నారాయణరావుకు నివాళులర్పించిన వారిలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ
ఐ. టి – కో ఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ వీరామహిళలు కామిశెట్టి హిమ శ్రీ, కందికట్ల అరుణ కుమారి, రాజానగరం మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, కోరుకొండ మండలం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు చదువు నాగేశ్వరరావు, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు కామిశెట్టి విష్ణు, రాజానగరం మండల జనసేన పార్టీ కార్యదర్శి నల్లమిల్లి విష్ణు చక్రం, కొచ్చర్ల బాబి, చదువు ముక్తేశ్వరరావు, తన్నీరు తాతాజీ, కొచ్చర్ల భరత్, వల్లేపల్లి రాజేష్, పెద్ద కాపు, చల్లా ప్రసాద్ తదితరులు ఉన్నారు.